50 క్వింటాళ్ల రేషన్‌బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-06-22T05:30:00+05:30 IST

మండలంలోని తరోడా గ్రామ సమీపాన మంగళవారం తెల్ల వారు జామున అక్రమంగా తరలిస్తున్న 50 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై అశోక్‌ తెలిపారు.

50 క్వింటాళ్ల రేషన్‌బియ్యం పట్టివేత
పట్టుబడిని బియ్యంతో వాహనం, నిందితుడు

ముథోల్‌, జూన్‌, 22 : మండలంలోని తరోడా గ్రామ సమీపాన మంగళవారం తెల్ల వారు జామున అక్రమంగా తరలిస్తున్న 50 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై అశోక్‌ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం భైంసా నుండి వైచర్‌ వ్యానులో సలీం అనే వ్యక్తి మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు తరలిస్తుండగా ముందస్తు సమాచారం మేరకు పోలీసులు తరో డా గ్రామ సమీపాన పట్టుకున్నారు. సంబంధిత రేషన్‌బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. 


Updated Date - 2021-06-22T05:30:00+05:30 IST