క్రీడల్లో సత్తా చాటాలి: ఎస్సై సాగర్
ABN , First Publish Date - 2021-12-27T04:01:58+05:30 IST
గ్రామీణ ప్రాంత యువత క్రీడల్లో సత్తాచాటాలని ఎస్సై సాగర్‌అన్నారు. ఆదివారం మండలం లోని కుంటలమానేపల్లి గ్రామంలో కుమరం భీం స్మారక వాలీబాల్ క్రీడలను ప్రారంభిం చారు.

బెజ్జూరు, డిసెంబరు 26: గ్రామీణ ప్రాంత యువత క్రీడల్లో సత్తాచాటాలని ఎస్సై సాగర్‌అన్నారు. ఆదివారం మండలం లోని కుంటలమానేపల్లి గ్రామంలో కుమరం భీం స్మారక వాలీబాల్ క్రీడలను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ గ్రామీణ ప్రాంత యువత క్రీడల్లో పట్టు సాధించి జాతీయ స్థాయికి ఎదగాల న్నారు. అలాగే క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ధృడత్వాన్ని పెంపొందిస్తా యన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ విజయ్, నిర్వాహకులు పాల్గొన్నారు.