సరిహద్దు గ్రామాలను సందర్శించిన అధికారులు

ABN , First Publish Date - 2021-05-19T03:45:14+05:30 IST

మండలంలోని సరిహద్దు గ్రామాలు అయిన పరందోళి, అంతాపూర్‌, ఎస్సాపూర్‌, ముక్దాంగూడలను తహసీల్దార్‌ సమీర్‌ అహ్మద్‌ఖాన్‌ ఆధ్వర్యంలో అధికారులు మంగళవారం సందర్శించారు.

సరిహద్దు గ్రామాలను సందర్శించిన అధికారులు
గ్రామస్థులతో మాట్లాడుతున్న తహసీల్దార్‌ సమీర్‌ అహ్మద్‌ఖాన్‌

కెరమెరి, మే 18: మండలంలోని  సరిహద్దు గ్రామాలు అయిన పరందోళి, అంతాపూర్‌, ఎస్సాపూర్‌, ముక్దాంగూడలను తహసీల్దార్‌ సమీర్‌ అహ్మద్‌ఖాన్‌ ఆధ్వర్యంలో అధికారులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో జ్వరాలతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి మెడికల్‌ కిట్లు అందజేశారు. అనంతరం గ్రామస్థులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో తహసీల్దార్‌ మాట్లాడారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో బయటి గ్రామాల నుంచి కొత్త వ్యక్తులు రానివ్వకుండా చూడాలని సూచించా రు. అత్యవసర పనుల నిమిత్తం బయటకు వెళ్లాలని చెప్పారు. గ్రామా ల్లో జరుగుతున్న ఈజీఎస్‌ పనులలో భౌతిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఫార్మాసిస్టు ఖలీల్‌ హుస్సేన్‌, వీఆర్వో మనోహర్‌, ఆర్‌ఐ అనసూర్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-19T03:45:14+05:30 IST