పారిశుధ్య వారోత్సవాలను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-03-25T05:09:39+05:30 IST

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో చేపడుతున్న ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం ఉట్నూ ర్‌, లక్కారం గ్రామ పంచాయతీల పరిధిలో నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను ఆయన పరిశీలించారు.

పారిశుధ్య వారోత్సవాలను విజయవంతం చేయాలి
పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలిస్తున్న డీపీవో శ్రీనివాస్‌

ఉట్నూర్‌, మార్చి 24: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో చేపడుతున్న ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం ఉట్నూ ర్‌, లక్కారం గ్రామ పంచాయతీల పరిధిలో నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. మురికి నీటి కాలువలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలన్నారు. మురికి నీటి కాలువలపై అక్రమ కట్టడాలను తొలగించాలని పంచాయతీ కార్యదర్శులను సూచించారు. అనంతరం లక్కారం గ్రామ పంచాయతీలోని పల్లెప్రకృతి వనాన్ని  పరిశీలించి మొక్కలను సంరక్షించాని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌పీవో భిక్షపతిగౌడ్‌, ఎంపీవో మహేష్‌కుమార్‌, ఉట్నూర్‌ సెక్రటరీ ఉప్పుల సత్యనారాణ, లక్కారం సర్పంచ్‌ జనార్దన్‌ రాథోడ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-25T05:09:39+05:30 IST