ఆన్‌లైన్‌లో నిర్మల్‌ బొమ్మల అమ్మకాలు

ABN , First Publish Date - 2021-03-22T06:38:01+05:30 IST

నిర్మల్‌లో ఉమ్మడి సదుపాయాల కేంద్రం ఏర్పాటు తో ఇకపై కళాకారులు తయారు చేసిన బొమ్మలను ఆన్‌లైన్‌ ద్వారా అమ్మకాలు జరుపవచ్చునని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్‌లో కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ ప్రారంభించారు. కొయ్యబొమ్మల పరిశ్రమలో ఏ

ఆన్‌లైన్‌లో నిర్మల్‌ బొమ్మల అమ్మకాలు
నిర్మల్‌లో మాట్లాడుతున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

- మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

నిర్మల్‌ కల్చరల్‌, మార్చి 21: నిర్మల్‌లో ఉమ్మడి సదుపాయాల కేంద్రం ఏర్పాటు తో ఇకపై కళాకారులు తయారు చేసిన బొమ్మలను ఆన్‌లైన్‌ ద్వారా అమ్మకాలు జరుపవచ్చునని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్‌లో కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ ప్రారంభించారు. కొయ్యబొమ్మల పరిశ్రమలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాటాడుతూ హస్తకళా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కళాకారులు తయారు చేసి న ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయిలో కూడా విక్రయించేందుకు అవకాశం కల్పించారన్నారు. కళాకారులు, చేతి వృత్తుల వారిని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ బొల్లం సంపత్‌ కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ ఐఏఎస్‌ అధికారి శైలజ రామయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌ పాల్గొన్నారు.

కవియాత్ర ప్రజల్లో చైతన్యం నింపాలి 

కవియాత్ర సమాజంలోని ప్రజల్లో చైతన్యం నింపాలని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం మూడో వార్షికోత్సవం సందర్భంగా నాలుగవ విడత కవియాత్రను మంత్రి ప్రారంభించారు. నిర్మల్‌ నుంచి నిజామాబాద్‌కు ఈ యాత్ర బయలుదేరింది. మంత్రితో పాటు ప్రముఖ కవి ఏనుగు నర్సింహ రెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆ తర్వాత చైర్మన్‌ నివేదిత, కృష్ణంరాజు, వెంకట్‌లు ప్రసంగించారు. ఇందులో జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, కవులు జీఆర్‌.కుర్మె, శివప్రసాద్‌, నారాయణ, శ్రీనివాసా చారి, పుండలిక్‌ రావు, తిరుపతి, కళ్యాణి, అరుణ, భీమేష్‌, నాగరాజు పాల్గొన్నారు. 

అడవులతోనే ప్రకృతి సమతుల్యత

నిర్మల్‌ టౌన్‌: అడవులతోనే ప్రకృతి సమతుల్యత సాధ్యమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఆదివారం అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భం గా ఆయన మాట్లాడుతూ ప్రకృతితో మన సంబంధాన్ని పునరాలోచించుకోవడా నికి, పునః నిర్వహించటానికి ఇదే సరైన సమయం అని, లేకపోతే భవిష్యత్తులో గాలి, నీరు దొరకని పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు సందర్భంగా విధిగా ఒక మొక్కను నాటి అందరికీ స్ఫూర్తి దాయకంగా నిలవాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు.

ఖాళీ స్థలం ఉంటే డబుల్‌ బెడ్‌ రూమ్‌ సౌకర్యం

సోన్‌: నిరుపేదలైన వారికి ఖాళీ స్థలం ఉంటే డబుల్‌ బెడ్‌ రూమ్‌ సౌకర్యం కల్పించడం కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని సంగెంపేట్‌ గ్రామంలో రెండు పడకల ఇళ్ల నిర్మాణపు పనులకు మంత్రి భూమిపూజ చేశారు. అనంతరం సోన్‌, మాదాపూర్‌ గ్రామాల్లో రైతు వేదికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడారు. ఇందేలో సంగెంపేట్‌, మాదాపూర్‌, సోన్‌ సర్పంచ్‌లు విలాస్‌, రాజనర్సింహ రెడ్డి, వినోద్‌ కుమార్‌, ఎంపీపీ బర్ల మానస, జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ అంపోలి కృష్ణప్రసాద్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నర్మదా, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-22T06:38:01+05:30 IST