పల్లె ప్రగతిని వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-01-13T06:12:29+05:30 IST

పల్లెప్రగతి పనులను వేగవంతం చేయాలని, ఎంపీడీవోలు, ఎంపీవో లు దినచర్య నివేదికలను ప్రతినె లా సమర్పించాలని స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌ అన్నారు.

పల్లె ప్రగతిని వేగవంతం చేయాలి
వీసీలో మాట్లాడుతున్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌

- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌

ఆదిలాబాద్‌ టౌన్‌, జనవరి 12: పల్లెప్రగతి పనులను వేగవంతం చేయాలని, ఎంపీడీవోలు, ఎంపీవో లు దినచర్య నివేదికలను ప్రతినె లా సమర్పించాలని స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి ఎంపీడీవోలు, ఎంపీవోలతో పల్లెప్రగతి, పాఠశాలల పున: ప్రా రంభం, నర్సరీలలో మొక్కల పెం పకం, కల్లాల నిర్మాణం, ఉపాధి పనుల కూలీల వేతనాలు, గ్రీన్‌ బడ్జెట్‌ వినియోగం, కొవిడ్‌ వ్యాక్సి న్‌ కేంద్రాల వద్ద పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఫిబ్రవరి 1నుంచి 9, ఆ పైతరగతులు అన్ని యజమాన్యాల పాఠశాలల పున: ప్రారంభం దృష్ట్యా పాఠశాలలను శుభ్రపర్చాలని, అందుకు పం చాయతీ, మున్సిపల్‌ పారిశుధ్య సిబ్బంది సహకారం తీసుకోవాలన్నారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రాల పరిధులలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎంపీడీఓలు, ఎంపీఓలు వారివారి దినచర్య నివేదికలను ప్రతిమాసం తప్పని సరిగా సమర్పించాలని, తద్వారా జిల్లా కలెక్టర్‌కు పరిశీలన నిమిత్తం సమర్పించడంజరుగుతుందని తెలిపారు. ఇందులో జడ్పీ సీఈవో కిషన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రాజేవ్వర్‌రాథోడ్‌, డీపీవో శ్రీనివాస్‌, డీఈవో రవీందర్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ ఈఈ మహావీర్‌, మున్సిపల్‌ కమిసనర్‌ సీవీఎన్‌ రాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-13T06:12:29+05:30 IST