‘భగీరథ’ గుంతలో పడిన ఆర్టీసీ బస్సు

ABN , First Publish Date - 2021-02-01T05:37:44+05:30 IST

నిత్యం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసే ఆర్టీసీ బస్సు మిషన్‌ భగీరథ గుంతలో పడి ప్రయాణికులు గాయాలపాలైన సంఘట న మండలంలోని మునిపెల్లిలో చోటు చేసుకుంది.

‘భగీరథ’ గుంతలో పడిన ఆర్టీసీ బస్సు
మునిపెల్లిలో మిషన్‌ భగీరథ గుంతలో పడిన ఆర్టీసీ బస్సు

ప్రయాణికులకు స్వల్ప గాయాలు 

అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామస్థుల ఆరోపణ

లక్ష్మణచాంద, జనవరి 31: నిత్యం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసే ఆర్టీసీ బస్సు మిషన్‌ భగీరథ గుంతలో పడి ప్రయాణికులు గాయాలపాలైన సంఘట న మండలంలోని మునిపెల్లిలో చోటు చేసుకుంది. ఎప్ప టిలాగే ఆదివారం మునిపెల్లి గ్రామానికి చెందిన ఆర్టీసీ బస్సు తిరిగి వెళ్తున్న క్రమంలో గొల్ల రాజన్న ఇంటి వద్ద గల మిషన్‌ భగీరథ పైప్‌ లైన్‌ వాటర్‌ చెక్‌ బాల్‌ గుంత పైకప్పు మూత విరగటంతో గుంతలో పడింది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యా యి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా నాసిరకం నిర్మాణం చేపట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సరైన ప్రణాళిక లేకుండా వేసిన పైప్‌ లైన్‌ వలన పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు భావిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య పూరిత పనితనం ప్రభుత్వాన్ని అబాసుపాలు చేస్తోందని పలువు రు అసహనం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-02-01T05:37:44+05:30 IST