సాయిబాబా ఆలయ అభివృద్ధికి రూ. కోటి నిధులు

ABN , First Publish Date - 2021-11-23T07:41:08+05:30 IST

నిర్మల్‌ పట్టణంలోని గండిరామన్న క్షేత్రంలో కొలువుదీరిన సాయిబాబా ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. కోటి నిధులను మంజూరు చేసిందని దేవాదాయశాఖ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా సహాయ కమిషనర్‌ విజయరామారావు తెలిపారు.

సాయిబాబా ఆలయ అభివృద్ధికి రూ. కోటి నిధులు
దేవాదాయ సహాయ కమిషనర్‌కు ప్రసాదం అందజేస్తున్న చైర్మన్‌

దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ విజయరామారావు

నిర్మల్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : నిర్మల్‌ పట్టణంలోని గండిరామన్న క్షేత్రంలో కొలువుదీరిన సాయిబాబా ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. కోటి నిధులను మంజూరు చేసిందని దేవాదాయశాఖ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా సహాయ కమిషనర్‌ విజయరామారావు తెలిపారు. సోమవారం ఆల యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వచ్చిన కమిష నర్‌కు ఆలయ కమిటీ చైర్మన్‌ లక్కడి జగన్మోహన్‌రెడ్డి స్వాగతం పలికి సన్మా నించారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించి జరుగుతున్న అభి వృద్ధి పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ... జగన్మోహన్‌రెడ్డి ఆలయ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేవలం ఆరునెలల్లోనే ఆలయ రూపురేఖలు మారిపోయాయన్నారు. ప్రహరీ నిర్మాణంతో పాటు ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన గ్రీనరీ, వాటర్‌ ఫౌంటైన్‌లు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. అలాగే ప్రస్తుతం ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధికి అదనంగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కృషితో ఆలయ ఆవరణలో పూజ మండపం, కళ్యాణ మండపం నిర్మా ణానికి, ఇతర అభివృద్ధి పనులకు రూ. కోటి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నిధులతో త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ కార్య క్రమంలో కమిషనర్‌ వెంట ఆడెల్లి, కాల్వ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల ఈవోలు, దేవాదాయశాఖ ఇన్స్‌పెక్టర్‌ రంగు రవికిషన్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-23T07:41:08+05:30 IST