జిల్లాలో పెరుగుతున్న చలి తీవ్రత
ABN , First Publish Date - 2021-10-29T05:58:41+05:30 IST
జిల్లాలో కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరుగుతోంది. గురువారం గరిష్ఠ ఉష్ణోగ్రత 31.3 కాగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 15.7కు పడిపోయింది. అక్టోబరు 20 నుంచి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రాత్రి వేలల్లో చలి తీవ్రత కనిపిస్తోంది.
ఆదిలాబాద్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరుగుతోంది. గురువారం గరిష్ఠ ఉష్ణోగ్రత 31.3 కాగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 15.7కు పడిపోయింది. అక్టోబరు 20 నుంచి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రాత్రి వేలల్లో చలి తీవ్రత కనిపిస్తోంది. అలాగే పొగమంచు కూడా కురువడంతో ఉదయం వేళల్లో మరింత చలి పెరుగుతోంది. అక్టోబరు చివరి మాసంలోనే చలి తీవ్రత ఇలా ఉంటే రాబోయే నవంబరు, డిసెంబరులో చలి ఏ స్థాయిలో ఉంటుందోనని జిల్లావాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ యేడు జిల్లాలో అధిక వర్షపాతం నమోదు కావడంతో చలితీవ్రత కూడా అదే స్థాయిలో ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు.