మండలాల్లో ఘనంగా మొహర్రం

ABN , First Publish Date - 2021-08-21T03:49:00+05:30 IST

మండలంలోని ఎల్లాప టార్‌ గ్రామంలో పీరీలబంగ్లా వద్ద మొహర్రం వేడుక లను ఘనంగా నిర్వహించారు. తొమ్మిదిరోజుల పాటు హుస్సేన్‌, హస్సేన్‌ల పేరుతో పీరీల పండగను కుల మతాలకు అతీతంగా నిర్వహించారు. శుక్రవారం పీరీలను నిమజ్జనం చేశారు.

మండలాల్లో ఘనంగా మొహర్రం
చింతలమానేపల్లిలో భక్తుల మొక్కులు

లింగాపూర్‌, ఆగస్టు 20: మండలంలోని ఎల్లాప టార్‌ గ్రామంలో పీరీలబంగ్లా వద్ద మొహర్రం వేడుక లను ఘనంగా నిర్వహించారు. తొమ్మిదిరోజుల పాటు హుస్సేన్‌, హస్సేన్‌ల పేరుతో పీరీల పండగను కుల మతాలకు అతీతంగా నిర్వహించారు. శుక్రవారం పీరీలను నిమజ్జనం చేశారు.

రెబ్బెన: జామా మసీదుకమిటీ, మైనార్టీ యువత ఆధ్వర్యంలో మండలకేంద్రంలో షరబత్‌ పంపిణీ చేశారు. కమిటీసభ్యులు జహీర్‌బాబా, నాసీర్‌ఉస్మాని, శంశీర్‌అలీ, దహురోద్దీన్‌, అప్రోజ్‌, ఉబేదుల్లా, జబ్బు, అన్సారీ పాల్గొన్నారు. 

చింతలమానేపల్లి: మండలకేంద్రంతో పాటు కర్జెల్లిగ్రామాల్లో పీరీల సందడినెలకొంది. గోదుమ పిండి, పంచదార, నెయ్యితో చేసిన మలీద ముద్దలను పీరీలకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం చేశారు. 

దహెగాం: మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో మొహర్రం పండుగను ప్రజలు ఘనంగా జరుపుకు న్నారు. దహెగాం, కొంచవెల్లి, హత్తినిలో పీరీల ఊరే గింపు నిర్వహించారు. 

ఆసిఫాబాద్‌: పట్టణంతోపాటు మండలంలో శుక్ర వారం మొహర్రం వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. గ్రామాల్లో పీరీల ఊరేగింపు నిర్వహించారు. పీరీలకుప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. పట్టణం లో మైనార్టీ నాయకులు షరబత్‌పంపిణీ చేశారు. అబ్దుల్‌ రహెమాన్‌, షబ్బీర్‌, జహుర్‌ అహ్మద్‌, షేక్‌చాంద్‌, అస్లాం పాల్గొన్నారు. 

బెజ్జూరు: మండలం లో శుక్రవారం పీరీల ఊరేగింపు చేపట్టారు. గోల్కొండ మసీద్‌సొసైటీ ఆధ్వర్యంలో షరబత్‌పంపిణీ చేశారు. కమిటీసభ్యులు అమీరోద్దీన్‌, ఉపాధ్యక్షుడు యూసుఫ్‌ఖాన్‌, తాజోద్దీన్‌, జాహీద్‌అలీ, నిజామోద్దీన్‌, రఫీక్‌, నిహాల్‌ ఉన్నారు. 

సిర్పూర్‌(టి): మండలంలోని చాకలివాడ, చింత కుంట గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం పీరీల ఊరే గింపు నిర్వహించారు. షర్బత్‌ పంపిణీ చేశారు.

కెరమెరి: మండల కేంద్రంలో మొహర్రం వేడుకల సందర్భంగా షరబత్‌పంపిణీచేసి పీరీల ఊరేగించారు.

సిర్పూర్‌(యూ):మండలకేంద్రంతోపాటు పాము లవాడ, భూన్నూర్‌, జీర్లఘట్‌, రాఘపూర్‌, పంగడి గ్రామాల్లో పీరీలపండుగ ఘనంగా నిర్వహించారు.

Updated Date - 2021-08-21T03:49:00+05:30 IST