ఘనంగా భోగి వేడుకలు

ABN , First Publish Date - 2021-01-14T04:34:58+05:30 IST

జిల్లావ్యాప్తంగా భోగి వేడుకలను బుధవారం నిర్వహించారు.

ఘనంగా భోగి వేడుకలు
కాగజ్‌నగర్‌లో వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ జాగృతి సంఘం నాయకులు

కాగజ్‌నగర్‌, జనవరి13: జిల్లావ్యాప్తంగా భోగి  వేడుకలను బుధవారం నిర్వహించారు. కాగజ్‌నగర్‌ పట్టణంలో తెలంగాణ జాగృతి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పర్శచంద్రశేఖర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో పండుగను అట్టహాసంగా జరిపేందుకు తమ సంఘం ఆధ్వర్యంలో   కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సి లర్‌ సునీల్‌, .జిల్లా అధికార ప్రతినిధి చింతల రవి, జిల్లా కో కన్వీనర్‌ జంగం లక్ష్మయ్య, సిర్పూరు నియోజకవర్గ కన్వీనర్‌ దామోదర్‌, జిల్లా యూత్‌ కో కన్వీనర్‌ శంకర్‌, విద్యార్థి విభాగం నాయకులు వెంకటేశ్వర్లు, దుర్గం దేవాజీ, దుర్గా ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-14T04:34:58+05:30 IST