జిల్లాలో 6 కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు

ABN , First Publish Date - 2021-08-28T05:12:29+05:30 IST

జిల్లాలో శుక్రవారం 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తం గా ఉన్న 29ప్రభుత్వ ఆసుపత్రులలో 278 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా బాన్స్‌వాడలో 5 గురికి పాజిటివ్‌గా నమోదైంది.

జిల్లాలో 6 కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు

కామారెడ్డిటౌన్‌, ఆగస్టు 27: జిల్లాలో శుక్రవారం 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తం గా ఉన్న 29ప్రభుత్వ ఆసుపత్రులలో 278 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా బాన్స్‌వాడలో 5 గురికి పాజిటివ్‌గా నమోదైంది. కామారెడ్డిలో నూతనంగా ఏర్పా టు చేసిన ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష కేంద్రంలో 28 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌గా వచ్చింది.

500 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌

బీర్కూర్‌: బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌ ఉమ్మడి మండలాల పరిధిలో శుక్రవారం 510 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చిన ట్లు మండల వైద్యాధికారి రవిరాజా తెలిపారు. బీర్కూర్‌, మైలారం గ్రామాల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ టీకాలు వేశామన్నా రు. 447మందికి మొదటి డోసు ఇవ్వగా, 63 మందికి రెం డవ డోసు ఇచ్చామన్నారు. బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌ మండ లాల పరిధిలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేస్తున్నామన్నారు.

Updated Date - 2021-08-28T05:12:29+05:30 IST