అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో
ABN , First Publish Date - 2021-02-06T05:30:00+05:30 IST
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను విరమించుకోవాలు రైతులు డిమాండ్ చేశారు. శనివారం ఢిల్లీలో పెద్దఎత్తున అన్నదాతలు చేపడుతున్న ఆందోళనకు మద్దతుగా జిల్లా కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపాట్టారు.

రైతు వ్యతిరేక చట్టాలను విరమించుకోవాలని డిమాండ్
ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 6: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను విరమించుకోవాలు రైతులు డిమాండ్ చేశారు. శనివారం ఢిల్లీలో పెద్దఎత్తున అన్నదాతలు చేపడుతున్న ఆందోళనకు మద్దతుగా జిల్లా కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపాట్టారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని చాంద బైపాస్ రోడ్డుపై కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు కార్పొరేట్, పెట్టుబడిదారులు, మొదలైన వారికి అనుకూలంగా ఉన్నాయని ఆరోపించారు. ఈ వ్యతిరేక రైతు చట్టాలను రద్దు చేసేంత వరకు ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు. ఇందులో ఏఐసీసీ సభ్యురాలు గండ్ర సుజాత, డీసీసీ సభ్యుడు సాజిద్ ఖాన్, పలు రైతులు సంఘాల నాయకులు ముడుపు ప్రభాకర్ రెడ్డి, బండి దత్తాత్రి, బొర్రన్న, లోకారి పోషెట్టి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.