అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేయాలని రాస్తారోకో
ABN , First Publish Date - 2021-10-21T03:54:38+05:30 IST
161వ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా అల్లాదుర్గం వద్ద అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేయకపోవడంతో ఆగ్రహానికి గురయిన మండల ప్రజలు, ఆయా పార్టీల నాయకులు బుధవారం అల్లాదుర్గం చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు.

అల్లాదుర్గం, అక్టోబరు 20 :161వ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా అల్లాదుర్గం వద్ద అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేయకపోవడంతో ఆగ్రహానికి గురయిన మండల ప్రజలు, ఆయా పార్టీల నాయకులు బుధవారం అల్లాదుర్గం చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు. జాతీయ రహదారి నిర్మాణం పనుల్లో అధికారుల నిర్వాహకంతో ఈ ప్రాంత వాహనచోదకులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్లపై మండల ప్రజల నుంచి రోజూరోజుకు ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. సుమారు గంట పాటు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ సాయాగౌడ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అల్లాదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ సాధన సమితి అధ్యక్షుడు కంచరి బ్రహ్మం, బీజేపీ నాయకులు కాళ్ల రాములు, కొంక శ్రీశైలం, మాజీ సర్పంచ్ శ్రీశైలం, నాయకులు ఈదునూరి సదానందం, శేఖ్ మధార్, శివ్వప్ప, సాయిలు, విఠల్, సూర్య నాయక్ ఉన్నారు.