మధ్యాహ్న భోజన నిర్వాహకుల రాస్తారోకో

ABN , First Publish Date - 2021-12-16T03:48:05+05:30 IST

మధ్యాహ్న భోజన నిర్వా హకులకు కనీస వేతనం చెల్లించడంతోపాటు పలు డిమాండ్లను పరిష్కరించాలని దండేపల్లిలో బుధవా రం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. మధ్యా హ్నభోజన వంట కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షు రాలు శ్రీదేవి మాట్లాడుతూ 19ఏళ్లుగా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజ నం ఇస్తున్నామని, గౌరవ వేత నం నెలకు రూ.1000 ఇస్తున్నారన్నారు. లేబర్‌ యాక్ట్‌ ప్రకారం కనీస వేతనం రూ.10,500 చెల్లించాలని డిమాండ్‌ చేశారు

మధ్యాహ్న భోజన నిర్వాహకుల రాస్తారోకో
దండేపల్లి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేస్తున్న నిర్వాహకులు, నాయకులు.

 దండేపల్లి, డిసెంబరు 15: మధ్యాహ్న భోజన నిర్వా హకులకు కనీస వేతనం చెల్లించడంతోపాటు పలు డిమాండ్లను పరిష్కరించాలని దండేపల్లిలో బుధవా రం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. మధ్యా హ్నభోజన వంట కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షు రాలు శ్రీదేవి మాట్లాడుతూ 19ఏళ్లుగా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజ నం ఇస్తున్నామని, గౌరవ వేత నం నెలకు రూ.1000 ఇస్తున్నారన్నారు. లేబర్‌ యాక్ట్‌ ప్రకారం కనీస వేతనం రూ.10,500 చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం కూరగాయల ధరలు పెరిగాయని, కోడిగుడ్డుకు ప్రభుత్వం రూ.4 చెల్లిస్తుండగా మార్కెట్‌లో రూ.7 ఉందన్నారు. కోడిగుడ్లను ప్రభు త్వమే సరఫరా చేయాలని, స్లాబ్‌ రేటు ఒక విద్యార్ధికి రూ.12 పెంచాల న్నారు. మూడు నెలల నుంచి బిల్లు లు రావడం లేదని, తమ డిమాం డ్లను పరిష్కరించాలని సమ్మెకు దిగు తున్నామన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షు డు రఘనాథ్‌ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన నిర్వా హకుల సమస్యలను పరిష్కరించి, వారికి రావాల్సిన బిల్లులు, కనీస వేతనం చెల్లించాలన్నారు. నిర్వాహకు లు భాగ్య, శ్యామల, మల్లేశ్వరీ, శంకరవ్వ, వనిత, పుష్పలత, శంకరవ్వ, రాజవ్వ లక్ష్మి, ఎంపీటీసీ ముత్యా ల శ్రీనివాస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.      

మధ్యాహ్న భోజనం వండిన ఉపాధ్యాయులు 

కాసిపేట : మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె చేస్తుండడంతో బుధవారం ఉపాధ్యాయులే వంటలు చేసి విద్యార్థులకు వడ్డించారు. బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె చేస్తుండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ఉపాధ్యాయులు వంటలు వండి వడ్డించారు. ప్రధానో పాధ్యాయుడు రాథోడ్‌ రమేష్‌, ఉపాధ్యాయులు బండ శాంకరి, కృష్ణ గోపాల్‌రావు, జ్యోతి పాల్గొన్నారు.

Updated Date - 2021-12-16T03:48:05+05:30 IST