పట్టణంలో ర్యాపిడ్ యాక్షన్ బలగాల ప్లాగ్‌మార్చ్
ABN , First Publish Date - 2021-08-06T05:12:16+05:30 IST
జిల్లాలో ఈ నెల 5 నుంచి 9 వరకు ప్రజా సమస్యలను తెలుసుకుంటూనే శాంతి భద్రతల పరిరక్షణకు పాటు పడాలనే లక్ష్యంతో జిల్లా కేంద్రానికి వచ్చిన కేంద్ర ర్యాపిడ్‌యాక్షన్ బలగాలు గురువారం జిల్లా కేంద్రంలో ప్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు ఎస్పీ రాజేశ్‌చంద్ర తెలిపారు.
ఆదిలాబాద్‌టౌన్, ఆగస్టు 5: జిల్లాలో ఈ నెల 5 నుంచి 9 వరకు ప్రజా సమస్యలను తెలుసుకుంటూనే శాంతి భద్రతల పరిరక్షణకు పాటు పడాలనే లక్ష్యంతో జిల్లా కేంద్రానికి వచ్చిన కేంద్ర ర్యాపిడ్‌యాక్షన్ బలగాలు గురువారం జిల్లా కేంద్రంలో ప్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు ఎస్పీ రాజేశ్‌చంద్ర తెలిపారు. అంతకు ముందు కేంద్ర బలగాల ప్లాగ్ మార్చ్‌ను అదనపు ఎస్పీ వినోద్‌కుమార్‌ప్రారంభించారు. పట్టణంలో అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో కవాతు నిర్వహించిన బలగాలను పట్టణ ప్రజలు శాలువా పూలమాలతో అభినందించి పుష్పవర్షం కురిపించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్‌లో ముందుగా ర్యాపిడ్ యాక్షన్ బలగాలతో సమావేశమై కార్యాచరణ ప్రకటించామన్నారు. అనంతరం వంద మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు డిప్యూటీ కమాండర్ అలోక్‌కుమార్, అదనపు ఎస్పీ వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో స్థానిక పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి బొక్కలగూడ, ఖానాపూర్, మసూద్‌ఛౌక్, అశోక్‌రోడ్డు గుండా గాంధీచౌక్, అంబేద్కర్‌చౌక్, తాంసి బస్టాండ్, భాగ్యనగర్, తాటిగూడ, క్రాంతినగర్, ఇందిరానగర్, రణదివ్యనగర్, ఖుర్షీద్‌నగర్ తదతర ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం పోలీసు శిక్షణ కేంద్రం వద్ద ర్యాలీని ముగించారు. ఇందులో సీఐలు పోతారం శ్రీనివాస్, రామకృష్ణ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్లు సీకే రెడ్డి, ఆర్‌కే పాండా, ఎస్సైలు సీవిస్మీత, బీఎల్ నాయక్, రవీందర్‌రెడ్డి, అర్జున్‌రావ్ తదితరులున్నారు.