రహదారుల నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

ABN , First Publish Date - 2021-08-22T03:52:15+05:30 IST

రహదారుల నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. భారత్‌కి ఆజాది అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సెమి నార్‌లో ఎమ్మెల్సీ పురాణం సతీష్‌, ఎమ్మెల్యే దివాకర్‌రావు, పంచాయతీరాజ్‌ ఈఈ ప్రకాష్‌ పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లా డుతూ రోడ్ల నిర్మాణంతో గ్రామాలు అభివృద్ధి చెందుతా యన్నారు.

రహదారుల నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ భారతి హోళికేరి

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 21: రహదారుల నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. భారత్‌కి ఆజాది అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సెమి నార్‌లో ఎమ్మెల్సీ పురాణం సతీష్‌, ఎమ్మెల్యే దివాకర్‌రావు, పంచాయతీరాజ్‌ ఈఈ ప్రకాష్‌ పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లా డుతూ రోడ్ల నిర్మాణంతో గ్రామాలు అభివృద్ధి చెందుతా యన్నారు. గ్రామాల నుంచి మండల కేంద్రాల మీదుగా జిల్లా కేంద్రానికి రోడ్డు సౌకర్యం కల్పించాలన్నారు. ప్రధానమంత్రి సడక్‌ యోజన ద్వారా ఫేజ్‌-1లో రూ.201 కోట్లతో 80 పనులు చేపట్టామని, ఫేజ్‌-2లో రూ.53.62 కోట్లతో 12 పనులు, ఫేజ్‌-3 బ్యాచ్‌-1లో రూ.31.21 లక్షలతో ఏడు పనులు, బ్యాచ్‌-2లో రూ.42.39 లక్షలతో 15 పనులు చేపట్టినట్టు పేర్కొన్నారు. రహదారుల అభివృద్ధిలో ఇంజినీరింగ్‌ అధికారులు, గుత్తేదార్ల పాత్ర కీలక మైనదన్నారు. జడ్పీ సీఈవో నరేందర్‌, వైస్‌చైర్మన్‌ సత్యనారాయణ, పంచాయతీరాజ్‌ డీఈలు, కాంట్రాక్టర్లు, జడ్పీటీసీ లు,  అధికారులు పాల్గొన్నారు. 

జిల్లా పరిషత్‌ సమావేశ మందిర నిర్మాణ పనులు సత్వరం పూర్తి చేయాలని కలెక్టర్‌ అన్నారు. శనివారం పనులను ఆమె పరిశీలించి అధికారులకు సలహాలు, సూచనలిచ్చారు. ఈ నెల 26న నిర్వహించే జడ్పీ సమావేశంలోగా తుది మెరుగులు దిద్ది భవనాన్ని ఉపయోగంలోకి తేవాలన్నారు. ఎలాంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రోటోకాల్‌ ప్రకారం కుర్చీలు వేయాలన్నారు.  

 

Updated Date - 2021-08-22T03:52:15+05:30 IST