‘కేజీబీవీ పాఠశాల నిర్మాణంలో నాణ్యత లోపం’

ABN , First Publish Date - 2021-12-19T06:05:46+05:30 IST

మందపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న కేజీబీవీ పాఠశాల నిర్మా ణంలో నాణ్యత లోపం ఉందని వైస్‌ ఎంపీపీ బైరెడ్డి గంగారెడ్డి, స్థానిక ప్రజలు ఆరోపించారు.

‘కేజీబీవీ పాఠశాల నిర్మాణంలో నాణ్యత లోపం’
పనులను పరిశీలిస్తున్న ఏఈ

పెంబి, డిసెంబరు 18 : మందపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న కేజీబీవీ పాఠశాల నిర్మా ణంలో నాణ్యత లోపం ఉందని వైస్‌ ఎంపీపీ బైరెడ్డి గంగారెడ్డి, స్థానిక ప్రజలు ఆరోపించారు. శనివారం వైస్‌ ఎంపీపీ బైరెడ్డి గంగారెడ్డి స్థానిక ప్రజలతో కలిసి కేజీబీవీ పాఠశాల నిర్మాణ పను లను పరిశీలించారు. పిల్లర్లదశలో ఉన్న పాఠశా ల పనుల్లో నాణ్యతలోపంను గుర్తించి సంబంఽ దిత డీఈకి సమాచారం అందించారు. వెంటనే ఏఈ ప్రదీప్‌ అక్కడకు చేరుకొని పనులను పరి శీలించారు. పిల్లర్ల దశలో ఉన్న పనుల్లో నాణ్యత లోపంను గుర్తించామని ఏఈ తెలిపారు. ఇప్పటి నుండి నాణ్యత ప్రమాణాలతో పనులు చేపట్టాల తగుచర్యలు తీసుకుంటామని తెలిపారు. సోమవారం డీఈ పనులను పరిశీలించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సుధాకర్‌, సూదుల శంకర్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ రాజేందర్‌, నాయకులు సంతోష్‌, స్థానిక ప్రజలు ఉన్నారు. 

Updated Date - 2021-12-19T06:05:46+05:30 IST