షెడ్యూలు ప్రకారమే శనగల కొనుగోలు

ABN , First Publish Date - 2021-03-24T05:38:16+05:30 IST

జిల్లాలో సంబంధిత మార్కెట్‌ యార్డులలో శనగల కొనుగోలు గ్రామాల వారీగా విడుదల చేసిన షెడ్యులు ప్రకారమే చేపట్టడం జరుగుతుందని జిల్లా మార్క్‌ఫెడ్‌ మేనేజర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు తమ సరుకును శుభ్రపరిచి చెత్తాచెదారం లేకుండా

షెడ్యూలు ప్రకారమే శనగల కొనుగోలు

ఆదిలాబాద్‌ టౌన్‌, మార్చి 23: జిల్లాలో సంబంధిత మార్కెట్‌ యార్డులలో శనగల కొనుగోలు గ్రామాల వారీగా విడుదల చేసిన షెడ్యులు ప్రకారమే చేపట్టడం జరుగుతుందని జిల్లా మార్క్‌ఫెడ్‌ మేనేజర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు తమ సరుకును శుభ్రపరిచి చెత్తాచెదారం లేకుండా ఎండలో ఆరబెట్టి, తేమ శాతం 14కు మించకుండా షెడ్యులు ప్రకారం ఇవ్వబడిన తేదీలలో మాత్రమే సంబంధిత మార్కెట్‌కు తీసుకు రావాలని కోరారు. కాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు శనగలు ప్రస్తుతం ఒక  ఎకరానికి 6.20 క్వింటాళ్లు కొనుగోలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.  

కాగా, రైతులు పండించిన శనగ పంటలో భాగంగా ప్రతీ గింజను కొనుగోలు చేయాలని పలువురు రైతులు కోరారు. మంగళవారం మార్కెట్‌కు శనగలు తీసుకొచ్చిన రైతులకు మార్కెట్‌ అధికారులు ఎకరానికి 6 క్వింటాళ్ల 20 కిలోలు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడంతో తమకు పూర్తి స్థాయిలో  శనగలు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. 

నేరడిగొండ: శనగ పంటను బుధవారం నుంచి బోథ్‌ మార్కెట్‌ యార్డు లో గ్రామాల వారీగా కోనుగోలు చేయనున్నట్లు సీఈవో నాగభూషణ్‌ తెలిపా రు. సూచించిన తేదీలలో పంటను మార్కెట్‌కు తేవాలని పేర్కొన్నారు.

Updated Date - 2021-03-24T05:38:16+05:30 IST