పూలాజీ బాబా బాటలో నడవాలి
ABN , First Publish Date - 2021-03-15T05:09:55+05:30 IST
ప్రతి ఒక్కరూ పూలాజీ బాబా సూచించిన ఆధ్యాత్మిక మార్గంలో నడుచుకోవాలని ఎంపీపీ పోటే శోబాబాయి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో సద్గురు పూలాజీ బాబా ధ్యాన మందిరం 13వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించా రు.
ఇంద్రవెల్లి, మార్చి 14: ప్రతి ఒక్కరూ పూలాజీ బాబా సూచించిన ఆధ్యాత్మిక మార్గంలో నడుచుకోవాలని ఎంపీపీ పోటే శోబాబాయి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో సద్గురు పూలాజీ బాబా ధ్యాన మందిరం 13వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ హాజరై ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ ప్రతి ఒక్కరు వ్యసనాలకు దూరంగా ఉండి పూ లాజీ బాబా సూచించిన భక్తిభావాన్ని అలవర్చుకోవాలన్నారు. అనంతరం ధ్యాన మందిర కమిటీ ఆధ్వ ర్యంలో భక్తులకు అన్నవితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ అంద్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాకురే రాందాస్, ఆదివాసీ ఆంద్ సంఘం జిల్లా అధ్యక్షుడు ముఖడే విష్ణు, పోటే సాయినాథ్, పుడంలిక్, బన్సీలాల్, డి. మాదవ్ పాల్గొన్నారు.