ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2021-03-15T05:09:16+05:30 IST

ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రాథోడ్‌బాపూరావు అన్నారు. ఆదివారం మండలంలోని కజ్జర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం ప్రభుత్వం అనేక అభివృద్ధి పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

తలమడుగు, మార్చి14: ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రాథోడ్‌బాపూరావు అన్నారు. ఆదివారం మండలంలోని కజ్జర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల  కోసం ప్రభుత్వం అనేక అభివృద్ధి పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. కజ్జర్ల గ్రామంలో  ఏడేళ్లలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. అనంతరం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి అన్ని విధాలుగా సహాయ సహాకారాలను అందిస్తానని హామీ ఇచ్చారు. ఇందులో టీఆర్‌ఎస్‌ పార్టీ మండల కన్వీనర్‌ ఎల్మ శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షులు తోట వెంకటేశ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి మొట్టె కిరణ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు అబ్దుల్లా, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-03-15T05:09:16+05:30 IST