ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

ABN , First Publish Date - 2021-04-07T05:54:30+05:30 IST

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం మండల కేంద్రంలోని అంజీ చౌరస్తా వద్ద బీజేపీ మండల నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవానికి ఎంపీ సోయం బాపూరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

ఇంద్రవెల్లి, ఏప్రిల్‌ 6: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం మండల కేంద్రంలోని అంజీ చౌరస్తా వద్ద బీజేపీ మండల నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవానికి ఎంపీ సోయం బాపూరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దొరల గడీల పాలన కూలిపోవడం ఖాయమని జోష్యం చెప్పారు. కేంద్ర ప్రభు త్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సోయం బాపురావు అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు మరప రాజు, సట్ల అశోక్‌, గెడాం భారత్‌, రాథోడ్‌ భీంరావులు పాల్గొన్నారు. 

నార్నూర్‌: మండల కేంద్రంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు తొడసం బండు నాయకులతో కలిసి మంగళవారం పార్టీ జెండాను అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న సబ్కా సాత్‌ సబ్కా వికాస్‌, సబ్కా విశ్వాస్‌ మంత్రాన్ని సాకారం చేసేందుకు పార్టీ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వసంత్‌, రెడ్డి నాయక్‌, ప్రకాష్‌చాలుర్కర్‌, బిక్కు, విజయ్‌, పుసం తుకారాం, గవాస్కర్‌, లాల్‌శావ్‌, హన్మంత్‌, రమేష్‌ పాల్గొన్నారు.

ఉట్నూర్‌: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక వినాయకచౌక్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సట్ల అశోక్‌, జిల్లా కార్యదర్శి కోండేరి రమేష్‌, జిల్లా మహిళా మోర్చా నాయకురాలు మెస్రం భాగ్యలక్ష్మిల ఆధ్వర్యంలో పార్టీ మండల అధ్యక్షుడు కొలిపాక రాజశేఖర్‌ బీజేపీ జెండాను అవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఎ ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కృషి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ నాయకులు ఉస్కమల్ల దేవిదాస్‌, విజయ్‌, మండల ప్రధాన కార్యదర్శి బండారు వెంకటేష్‌, బీజేవైఎం మండల అధ్యక్షుడు రాజేందర్‌, ఉపాధ్యక్షుడు జగన్‌, శ్రీమంగళ్‌రాహుల్‌, ఇప్ప మధుకర్‌, కుర్సింగ సాయి, ఎలగందుల కళ్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఇచ్చోడ: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ వేడుకలు మండల కేంద్రం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల కన్వీనర్‌   కేంద్రే నారాయణ మాట్లాడారు. ప్రతీ కార్యకర్త క్షేత్రస్థాయిలో గ్రామాలకు వెళ్లి బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కోల్లురి శేఖర్‌, భీంరెడ్డి, కదం బాబారవ్‌, మాధవ్‌ రావ్‌ ఆమ్టే, అనురాధ తదితరులు ఉన్నారు. 

తాంసి: బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మేళ వాయిద్యాలతో ముందుగా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం జెండాను ఎగుర వేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మామ సంతోష్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం మాయమాటలు చెప్పి కాలం వెళ్లదీస్తోందని ఆరోపించారు. ప్రతీ గ్రామంలో కార్యకర్తల సంఖ్యను పెంచి పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో సహకార సొసైటీ డైరెక్టర్‌ సామ కవితరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సోమ ప్రవీణ్‌రెడ్డి, స్వామి, విలాస్‌, విశాల్‌, అశోక్‌ తదితరులున్నారు.

జైనథ్‌ : రాష్ట్రంలో 2023లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మండలంలోని కరంజి, బెల్గావ్‌, కౌట, నిరాల, జైనథ్‌, అడ, మేడిగూడ తదితర గ్రామాలతో పాటు మండలంలోని దీపాయిగూడ గ్రామంలో పార్టీ జెండాలను ఎగుర వేశారు. ఈ సందర్బంగా దీపాయిగూడ రామ్‌ మందిరం, నిలువెత్తు హనుమాన్‌ విగ్రహం వద్ద పలు కూడళ్లలో పార్టీ జెండాలను నాయకులు ఆవిష్క రించారు. ఈ కార్యక్రమంలో జైనథ్‌ మండల అధ్యక్షుడు కట్కం రాందాస్‌, జిల్లా ఉపాధ్యక్షుడు ఎనుగు రతన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి పోతరాజు, రమేష్‌, నాయకులు నారాయణరెడ్డి, ఎంపీటీసీ కరుణాకర్‌రెడ్డిలతో పాటు ఆయా గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ ఎంపీటీసీలు సర్పంచ్‌లు పాల్గొన్నారు. 

బోథ్‌: మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాను పార్టీ మండల కన్వీనర్‌ సుభాష్‌సూర్య ఎగుర వేశారు. అనంతరం కార్యక్రమంలో మండల కన్వీనర్‌తో పాటు ఓబీసీ బీజేపీ జిల్లా కన్వీనర్‌ గొర్లరాజుయాదవ్‌లు మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న తీరును ప్రజలకు వివరించాలన్నారు. గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగరేయడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు జీవీ రమణ, జక్కుల వెంకటేశ్‌, కట్ట భూమేష్‌, నల్ల గంగయ్య, అశోక్‌రెడ్డి, గిరీష్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌అర్బన్‌: కలిసి కట్టుగా గ్రామీణ ప్రాంతాల నుంచి పార్టీని మరింత పటిష్ఠ పరిచి రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామని బీజేపీ నాయకులు అన్నారు. ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం గ్రామ గ్రామాన బూత్‌ల వారీగా పార్టీ జెండాలను ఎగుర వేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట పట్టణ అధ్యక్షుడు లాలామున్నా ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నరేంద్రమోదీ పాలనను చూసి అన్ని పార్టీలో వణుకు పుడుతుందని బీజేపీ వైపు అన్ని పార్టీల నాయకులు ఆకర్షితులవుతే పార్టీలో చేరుతున్నారన్నారు. రానున్న ఎన్నికల వరకు పార్టీని మరింత బలోపేతం చేసి రాష్ట్రంలో అధికారంలోకి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కౌన్సిలర్లు వేణుగోపాల్‌, లోక ప్రవీణ్‌రెడ్డి, శివ, శేఖర్‌, జోగు రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-07T05:54:30+05:30 IST