ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం

ABN , First Publish Date - 2021-07-13T04:46:12+05:30 IST

బీజేపీ సిర్పూర్‌ నియోజకవర్గకార్యాలయంలో సోమవారం ఓబీసీ జిల్లాకమిటీ ఆధ్వ ర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి సోమవారం క్షీరాభిషేకం చేశారు.

ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం
ప్రధాని చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న నాయకులు

కాగజ్‌నగర్‌ టౌన్‌, జూలై 12: బీజేపీ సిర్పూర్‌ నియోజకవర్గకార్యాలయంలో సోమవారం ఓబీసీ జిల్లాకమిటీ ఆధ్వ ర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి సోమవారం క్షీరాభిషేకం చేశారు. ఇటీవల విస్తరించిన కేంద్ర మంత్రివర్గంలో ఓబీసీలకు అధిక ప్రాధాన్యమివ్వడంతో సంబురాలు జరుపుకున్నారు. జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పులగం నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సిర్పూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌, ఓబీసీమోర్చా జిల్లా నాయకుడు పార్వతీశంకర్‌, రవీందర్‌, మాచర్ల శ్రీనివాస్‌, కృష్ణసామి పాల్గొన్నారు.

Updated Date - 2021-07-13T04:46:12+05:30 IST