అభివృద్ధి కాదు అక్రమాలను అడ్డుకుంటున్నాం: అఖిలపక్షం

ABN , First Publish Date - 2021-10-08T03:40:55+05:30 IST

బెల్లంపల్లి పట్టణాభివృద్ధిని అడ్డుకోవడం లేదని అక్ర మాలను అడ్డుకుంటున్నామని అఖిలపక్షం నాయకులు పేర్కొన్నారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అఖిలపక్షం పేరుతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, అక్రమ వసూళ్లు చేస్తున్నారని ఆరోపించడం సరైంది కాదన్నారు.

అభివృద్ధి కాదు అక్రమాలను అడ్డుకుంటున్నాం: అఖిలపక్షం
మాట్లాడుతున్న అఖిలపక్షం నాయకులు

బెల్లంపల్లి, అక్టోబరు 7: బెల్లంపల్లి పట్టణాభివృద్ధిని అడ్డుకోవడం లేదని అక్ర మాలను అడ్డుకుంటున్నామని అఖిలపక్షం నాయకులు పేర్కొన్నారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అఖిలపక్షం పేరుతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, అక్రమ వసూళ్లు చేస్తున్నారని ఆరోపించడం సరైంది కాదన్నారు. అధికార పార్టీ నాయకులు భూకబ్జాలకు పాల్పడితే అధికారులు, హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తు న్నామని, ఇది జీర్ణించుకోలేక ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య భూకబ్జాలు చేసే వారిని ప్రోత్సహిస్తున్నాడని పేర్కొన్నారు. భూకబ్జాల పై సంబంధిత ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అఖి లపక్షంపై అసత్య ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే చిన్నయ్య క్షమాపణలు చెప్పాల ని, లేకపోతే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సీపీఐ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రేగుంట చంద్రశేఖర్‌, అఖిలపక్షం నాయకులు గెల్లి జయరాంయాదవ్‌, మాణిక్యం, సతీష్‌కుమార్‌, గోగర్ల శంకర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-08T03:40:55+05:30 IST