పాఠశాలల పునః ప్రారంభానికి సర్వం సిద్ధం చేయండి

ABN , First Publish Date - 2021-08-25T06:55:10+05:30 IST

సెప్టెంబరు 1 నుండి అన్ని పాఠశాలలు ప్రారం భించనున్నందున స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించి అన్ని పాఠశాలల్లో పారిశుద్ధ్య పను లు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు.

పాఠశాలల పునః ప్రారంభానికి సర్వం సిద్ధం చేయండి

30 లోగా పాఠశాలల్లో పారిశుధ్య పనులు పూర్తి చేయాలి 

సెప్టెంబరు 1 నుండి విద్యాలయాలు పునఃప్రారంభం

వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు

నిర్మల్‌టౌన్‌, ఆగస్టు 24 : సెప్టెంబరు 1 నుండి అన్ని పాఠశాలలు ప్రారం భించనున్నందున స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించి అన్ని పాఠశాలల్లో పారిశుద్ధ్య పను లు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లు, మున్సిపల్‌ నగర పాలక సంస్థ చైర్మన్లు, జిల్లా విద్యాధికారులు, జిల్లా పంచాయతీ అధికారులతో పాఠశాలల పునఃప్రారంభం, పారిశుద్ధ్య పనుల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సంద ర్భంగా  మంత్రి మాట్లాడుతూ.. కొవిడ్‌ కారణంగా పాఠశాలలు తిరిగి 16 నెలల తర్వాత సెప్టెంబరు 1 నుండి ప్రారంభించుకుంటున్నామని, విద్యార్థు లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు, మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాలని అన్నారు. పాఠశాలల్లో ప్రతితరగతి గదిని ఫర్నిచర్‌ను శుభ్రపరచాలని అన్నారు. ముఖ్యంగా మరుగుదొడ్లను శుభ్రం చేయించాలని అన్నారు. పాఠశాలల్లోని కిచెన్‌షెడ్లను ప్రత్యేకంగా శుభ్రం చేయించాలని అన్నారు. ప్రతీ పాఠశాలకు మిషన్‌ భగీరథ ద్వారా నల్లానీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థులు కొవిడ్‌ నిబం ధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, ప్రతీవిద్యార్థి తప్పనిసరిగా మాస్కులు ధరించి పాఠశాలలకు రావాలని, భౌతికదూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ప్రైవేట్‌ పాఠశాల్లో కూడా పారిశుద్ధ్య పనులు చేపట్టేలా జిల్లా విద్యాశాఖాధికారులు పర్యవేక్షించాలని అన్నారు. ప్రైవేట్‌ పాఠ శాలల బస్సుల్లో విద్యార్థులు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసు కోవాలని అన్నారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల పారిశుద్ధ్య చర్యల బా ధ్యత ఆయా గ్రామ పంచాయతీలదేనని తెలిపారు. ఆగస్టు 30 లోగా అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య పనులు నిర్వి హంచి ప్రారంభానికి సిద్ధంగా ఉంచినట్లు సంబంధిత ప్రధానోపాధ్యాయులు సర్టిఫికెట్‌ను జిల్లాల కలెక్టర్‌లకు సమర్పించాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ కొరిపెల్లి విజయలక్ష్మి, అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) రాంబాబు, జడ్పీ సీఈవో సుధీర్‌, డీఈవో ప్రణీత, డీపీవో వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-25T06:55:10+05:30 IST