పులిచర్మం స్వాధీనం

ABN , First Publish Date - 2021-11-01T05:07:30+05:30 IST

ఆదిలా బాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండ లం హీరాపూర్‌ నుంచి మహారాష్ట్రకు పులిచర్మం తరలి స్తున్న తొమ్మిది మందితో కూడిన ముఠాను ఆదివారం రాత్రి అరెస్టు చేసినట్టు జిల్లా అటవీశాఖ అధికారి శాంతా రాం తెలిపారు.

పులిచర్మం స్వాధీనం
పట్టుబడిన ముఠా సభ్యులు

- తొమ్మిది మంది అరెస్టు

కాగజ్‌నగర్‌, అక్టో బరు 31: ఆదిలా బాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండ లం హీరాపూర్‌ నుంచి మహారాష్ట్రకు పులిచర్మం తరలి స్తున్న తొమ్మిది మందితో కూడిన ముఠాను ఆదివారం రాత్రి అరెస్టు చేసినట్టు జిల్లా అటవీశాఖ అధికారి శాంతా రాం తెలిపారు. ఆదివారం రాత్రి ఆయన కాగజ్‌నగర్‌ అటవీశాఖ కార్యాల యం లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఇంద్రవెల్లి మండలం బడుగ గ్రామంలోని పొలాల్లో ఏడాది క్రితం విద్యుత్‌ వైర్లను అమర్చి పులిని హతమార్చినట్టు తెలిపారు.

పులి తాలుకూ చర్మం పూర్తిగా తీసి రవాణా కోసం సిద్ధంగా ఉంచగా పక్కా సమాచారం మేరకు కాగజ్‌నగర్‌ పెద్దవాగు వద్ద మాటు వేసి పట్టుకున్నట్టు డీఎఫ్‌వో శాంతారాం తెలిపారు. ఈ ముఠాలో ఇంద్రవెల్లికి చెందిన కొట్నాక్‌ దేవ్‌రావు, గొడువు అవినాష్‌, మెస్రం మంకు, మెస్రం దీపిక్‌, మెస్రం చంద్రకాంత్‌, మెస్రం ఈశ్వర్‌, మెస్రం లక్ష్మణ్‌, దేవ్‌రావు, ముకుంద్‌రావు ఉన్నట్టు తెలిపారు. వీరి వద్ద నుంచి పులిచర్మ స్వాధీనం చేసుకొని వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి ఆదిలాబాద్‌ జిల్లా కోర్టుకు తరలించినట్టు వివరించారు.ఎఫ్‌డీవో విజయ్‌కుమార్‌, టైగర్‌ మానిటరింగ్‌ సిబ్బంది, ట్రాకర్స్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-01T05:07:30+05:30 IST