రాజకీయ కలకలం

ABN , First Publish Date - 2021-05-02T06:23:29+05:30 IST

రాష్ర ్టఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను ఆ పదవి నుంచి మార్పు చేసిన వ్యవహారంతో పాటు ఆయన భూములకు సంబంధించి ఆకస్మికంగా జరిపిన విచారాల వ్యవహారం రాజకీయ కేంద్రమైన నిర్మల్‌ జిల్లాలో దుమారం రేపుతోంది.

రాజకీయ కలకలం

ఈటలపై వేటుతో దుమారం 

రాజేందర్‌కు జిల్లాతో బంధుత్వం 

బీసీ వర్గాల్లో కొత్తచర్చలు

రాజకీయ సమీకరణల మార్పుపై పుకార్లు 

నిర్మల్‌, మే 1 (ఆంధ్రజ్యోతి) : రాష్ర ్టఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను ఆ పదవి నుంచి మార్పు చేసిన వ్యవహారంతో పాటు ఆయన భూములకు సంబంధించి ఆకస్మికంగా జరిపిన విచారాల వ్యవహారం రాజకీయ కేంద్రమైన నిర్మల్‌ జిల్లాలో దుమారం రేపుతోంది. ఈటెల రాజేందర్‌కు జిల్లాతో సమీప బంధుత్వం ఉన్న కారణంగా ఈ అంశం ప్రస్తుతం చర్చకు దారి తీస్తోంది. ఈటెల రాజేందర్‌ వి య్యంకులు హార్టికల్చర్‌ కమిషనర్‌ వెంకట్రామ్‌రెడ్డి సొంత గ్రామం జిల్లాలోని కడెం మండలం రేవోజిపేట్‌ కావడం ప్రస్తుతచర్చకు కారణమవుతోందంటున్నారు. వెంకట్రామ్‌ రెడ్డి కూతురుకు మంత్రి ఈటెల రాజేందర్‌ కుమారునితో కొంతకాలం క్రితం వివాహం జరిగింది. ఈ వివాహ కార్యక్రమం సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్‌ పలుసార్లు కడెం మండలంలో బసచేశారు. ఈ సందర్భంగా మండల వాసులతోనే కాకుండా ఖానాపూర్‌, నిర్మల్‌ నియోజకవర్గానికి చెందిన పలువురిని ఆయన కలిశారు. అలాగే వివాహ కార్యక్రమానికి నిర్మల్‌జిల్లాకు చెందిన అన్నిపార్టీల నాయ కులతో పాటు పలు బీసీ సంఘాలకు చెందిన నేతలు హాజరయ్యారు. దీంతో పాటు ఆయనకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకాలం నుంచి జిల్లాతో అవినాభావ సంబంధాలున్నాయి. ఉద్యమసమయంలో ఈటల రాజేందర్‌ సీఎం కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్‌తో కలిసి విసృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలందరితో ఆయన సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయి. అలాగే బీసీ సంఘాల ప్రతినిధులకు సైతం ఆయన సుపరిచితుడే. ఈ క్రమంలో జిల్లాకు చెందిన బీసీ సంఘాల నేతలు ఆయనను పలుసార్లు కలిసి బీసీల సమస్యలపై చర్చించారు. కాగా గత రెండు రోజుల నుంచి కొనసాగుతున్న నాటకీయ పరిణామాలు సర్వత్రా ఆసక్తిని రేకేత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్‌పై కొంతమంది రైతులు నేరుగా సీఎంకు ఫిర్యాదు చేయడం, ఈ ఫిర్యాదుపై స్పందించిన సీఎం కేసీఆర్‌ ఆగమేఘాల మీద విచారణకు ఆదేశించడం, మరుసటి రోజు ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి తప్పించడం లాంటి పరిణామాలన్ని కేవలం 24 గంటల్లోనే జరిగిపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అలాగే ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి తొలగించిన వ్యవహారం బీసీ సంఘాల్లో సైతం కొత్త చర్చకు తెరలేపుతోంది. దీంతో పాటు కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల్లో కూడా ఈటెల వ్యవహారం ఆసక్తిని కలిగిస్తోంది. ఈటెలపై వచ్చిన ఫిర్యాదులకు పెద్దగా ప్రాధాన్యత లభించకపోతున్నప్పటికీ ఆయనపై కక్ష్యసాధింపు చర్యలు, మంత్రిపదవి నుంచి తొలగింపు లాంటి అంశాలే ప్రస్తుతం హాట్‌టాఫిక్‌గా మా రుతున్నాయి. ఆర్థికశాఖ మంత్రిగా, ఆరోగ్యశాఖ మంత్రిగా ఈటెల నిర్మల్‌ జిల్లాలో పర్యటించి ఇక్కడి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్నారంటున్నారు. ముఖ్యంగా జిల్లా ఆసుపత్రి అప్‌గ్రేడేషన్‌ అలాగే డయాలసిస్‌ సెంటర్‌ డయాగ్నోస్టిక్‌ హబ్‌ లాంటి సౌకర్యాలు ఈటెల హయాంలోనే కల్పించబడ్డాయంటున్నారు. అలాగే ఖానాపూర్‌లో ఉన్న కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ను ఏరియా ఆసుపత్రిగా అ ప్‌గ్రేడేషన్‌ జరగడం వెనక మంత్రి ఈటల కృషి ఉందంటున్నారు. ఇక్కడి ప్రజా ప్రతినిధులందరితో ఈటలకు స్నేహపూర్వక సంబంఽధాలున్న కారణంగా ఆసుపత్రిలో సౌకర్యాలపై వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి ఆయన చొరవ తీసుకునే వారంటున్నారు. ఇలా జిల్లాతో రాజకీయంగానూ, బంధుత్వపరంగానూ, బీసీ సంఘాల ప్రాతినిధ్యం పరంగానూ ఈటల రాజేందర్‌కు సంబంధాలుండడంతో ప్రస్తుతం ఆయనపైనే కొత్తచర్చ జరుగుతోంది. 

రెండు రోజుల నుంచి ఉత్కంఠ

కాగా మంత్రి ఈటల రాజేందర్‌కు సంబంధించిన భూములపై శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ విచారణకు ఆదేశించినప్పటి నుంచి రాజకీయ ఉత్కంఠ మొదలైంది. ఇక్కడి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో ఈటెల వ్యవహరంపై ఉత్కంఠ కొనసాగుతోంది. శనివారం ఉన్నతాధికారులు ఈటెల భూములపై విచారణ జరపడం, సీఎం కేసీఆర్‌ ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించడం లాంటి వ్యవహారాలు ఇక్కడి రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకేత్తించాయి. ముఖ్యంగా అధి కార టీఆర్‌ఎస్‌ పార్టీతో పాటు ఇక్కడి బీజేపీలో వర్గాల్లో ఈటలరాజేందర్‌ వ్యవహారంపైనే చర్చ జరిగింది. ముఖ్యం గా బీజేపీ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మంత్రి ఈటల రాజేందర్‌పై సీఎం కేసీఆర్‌ తీసుకోబోయే చర్యలపైనే ఆసక్తి నెలకొంది. రాజకీయాలతో సంబంఽధాలున్న వారంతా మధ్యాహ్నం నుంచి టీవిలకే అతుక్కుపోయి సీఎం కేసీఆర్‌ తీసుకునే చర్యలను గమనించారు. ఎట్టకేలకు కేసీఆర్‌ ఈటల రాజేందర్‌ను పదవి నుంచి తప్పించడం ఇక్కడి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. 

జిల్లాతో ఈటలకు బంధుత్వం

ఈటల రాజేందర్‌కు నిర్మల్‌ జిల్లాతో సమీప బంధుత్వం ఉండడంతో ఈ అంశానికి ప్రాధాన్యత చేకూరింది. ఈటెల రాజేందర్‌ కుమారునికి కడెం మండలంలోని రేవోజిపేట్‌ గ్రామానికి చెందిన హార్టికల్చర్‌ కమిషనర్‌ ఎల్‌. వెంకట్రామ్‌రెడ్డి కూతురుతో కొద్దిరోజుల క్రితం వివాహం జరిగింది. దీంతో వెంకట్రామ్‌రెడ్డితో పాటు ఆయన సమీప బంధువులందరికీ మంత్రి ఈటల రాజేందర్‌ కూడా బంధువుగా మారిపోయారు. శనివారం ఈటలపై విచారణ జరగడం. అలాగే ఆయనను పదవి నుంచి తప్పించడం లాంటి వ్యవహారాలన్ని కడెం మండలంతో పాటు నిర్మల్‌ నియోజకవర్గంలో హాట్‌టాఫిక్‌గా మారిపోయాయి. ఈటల రాజేందర్‌కు జిల్లాతో బంధుత్వం ఉండడమే కాకుండా ఉద్యమ సంబంధాలు సైతం ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఈటెల రాజేంధర్‌ జిల్లాకు పలుసార్లు రావడమే కాకుండా ఇక్కడ జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో సైతం ఆయన పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లతో ఆయన జిల్లా అంతటా పర్యటించారు. ఇలా ఉద్యమపరంగానూ రాజకీయ పరంగానే కాకుండా బంధుత్వపరంగా ఈటెలకు జిల్లాతో అవినాభావ సంబంధాలున్న కారణంగా ఆయన రాజకీయ వ్యవహారం జిల్లా అంతటా ఆసక్తిని రేకేత్తించిందంటున్నారు. 

బీసీ సంఘాల్లో కొత్తచర్చ

కాగా మంత్రి ఈటెల రాజేంధర్‌పై సీఎం వ్యవహరించిన తీరుతో జిల్లాలోని పలు బీసీ సంఘాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. మొదటి నుంచి బీసీ ఆత్మ గౌరవం, బీసీల ఆత్మాభిమానం నినాదాలతో ఈటెల రాజేంధర్‌ ఆ వర్గాలకు చేరువయ్యారు. జిల్లాలోని పలు బీసీ సంఘాల నాయకులతో ఈటెల రాజేంధర్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. బీసీల సభలు, సమావేశాలకు చాలా మంది జిల్లానేతలు హాజరైన సందర్భంగా మంత్రి ఈటలను కలిసి ఆయనతో ఫోటోలు దిగేవారు. ఈ ఫోటోలను బీసీ సంఘాల నాయకులు సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకునేవారు. కాగా సీఎం కేసీఆర్‌ ఈటెలపై ఆకస్మికంగా తీసుకున్న చర్యలు బీసీ సంఘాలను విస్మయానికి గురి చేస్తున్నాయంటున్నారు. చాలా మంది బీసీ నాయకులు బహిరంగంగా నోరు మెదపకపోతున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం దీనిపై సమీక్షిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

Updated Date - 2021-05-02T06:23:29+05:30 IST