కరోనా నియంత్రణపై అవగాహన కల్పించిన పోలీసులు
ABN , First Publish Date - 2021-05-20T06:43:16+05:30 IST
కరోనా వ్యాధిని నియంత్రించాలంటే ప్రతీ ఒక్కరూ రెండు డోసుల టీకా తీసుకోవడమే మార్గమని నిర్మల్ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి అన్నారు.

నిర్మల్ కల్చరల్, మే 19 : కరోనా వ్యాధిని నియంత్రించాలంటే ప్రతీ ఒక్కరూ రెండు డోసుల టీకా తీసుకోవడమే మార్గమని నిర్మల్ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక మంచిర్యాల్ చౌరస్తాలో కరోనా మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో సీఐ జీవన్‌రెడ్డి ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ఎస్పీ ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు టీకా ప్రాధా న్యత జాగ్రత్తలపై ప్రజలకు వివరించారు. 45 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరూ టీకా తప్పకుండా తీసుకోవాలని విచిత్ర వేషధారణతో పోలీస్‌శాఖ కళా కారులు ప్రదర్శన నిర్వహించారు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పా టించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత తదితర వాటిపై స్కిట్స్ ప్రద ర్శించారు. లాక్‌డౌన్ సమయంలో ఏ విధంగా వ్యవహరించాలో తెలిపారు. అనవసరంగా బయట తిరగరాదని, బహిరంగ ప్రదేశాల్లో నిబంధనలు ఉ ల్లంఘించరాదని హితబోధ చేశారు. లాక్ డౌన్ సడలింపు సమయంలో పనులు పూర్తి చేసుకోవాలని, ఆ తర్వాత బయట తిరిగితే పోలీస్ కేసులు జరిమానా విధింపు తదితర సమస్యలు ప్రజల దృష్టికి తెచ్చారు. ఈ సంద ర్భంగా కరోనా మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో తెలియజేసే కరపత్రాలు, పోస్టర్లు ప్రదర్శించారు. ఎస్సైలు రమేష్, యూనుస్ అలీ, దేవేందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.