పోలీస్‌స్టేషన్లు ఆహ్లాదకరంగా ఉండాలి
ABN , First Publish Date - 2021-07-09T04:03:51+05:30 IST
పోలీస్‌స్టేషన్లు ఆహ్లాదకరంగా ఉండాలని, ప్రభుత్వం చేప ట్టిన హరితహారంలో పోలీసులు విరివిగా మొక్కలు నాటాలని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర గుప్తా పేర్కొన్నారు. గురువారం బెల్లం పల్లిలోని పోలీస్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు.

బెల్లంపల్లి, జూలై 8: పోలీస్‌స్టేషన్లు ఆహ్లాదకరంగా ఉండాలని, ప్రభుత్వం చేప ట్టిన హరితహారంలో పోలీసులు విరివిగా మొక్కలు నాటాలని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర గుప్తా పేర్కొన్నారు. గురువారం బెల్లం పల్లిలోని పోలీస్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడు తూ సీఎం కేసీఆర్ అధునాతన వాహనాలు కొనుగోలు చేసి పోలీసు శాఖకు అందించారన్నారు. ప్రతినెల ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నారన్నారు. హరితహారంలో కమిషనరేట్ పరిధిలో పెద్దఎత్తున మొక్కలు నాటుతున్నామని పేర్కొన్నారు. సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌లలో విరివిగా మొక్కలు నాటుతున్నామని, గ్రామాల్లో ప్రజాప్రతినిధులతో కలిసి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామన్నారు. డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఓఎస్‌డీ శరత్‌చంద్రపవర్, అడిషనల్ డీసీపీ ఏఆర్ సంజీవ్, ఏసీపీలు రహె మాన్, మల్లికార్జున్, అఖిల్ మహాజన్, నరేందర్, బెల్లంపల్లి రూరల్ సీఐ జగదీష్, టౌన్ ఇన్‌స్పెక్టర్ రాజు, సీఐ బాబురావు, ఆర్‌ఐలు అంజన్న, అనిల్ పాల్గొన్నారు.
కాసిపేట: పోలీస్‌స్టేషన్‌లు ఆహ్లాదకరంగా ఉండాలని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర గుప్తా, రామగుండం సీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. కాసిపేట పోలీస్‌స్టేషన్‌లో మొక్కలు నాటి నీరు పోశారు. అనం తరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. సీఐ ప్రమోద్‌కుమార్, కాసిపేట ఎస్‌ఐ నరేష్, పోలీసులు పాల్గొన్నారు.