శాంతిభద్రతలకు పోలీసుల కృషి
ABN , First Publish Date - 2021-12-31T06:27:52+05:30 IST
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ కృషి చేస్తుందని ఎస్పీ సీహెచ్. ప్రవీణ్‌కుమార్ తెలిపారు.

7.21 శాతం కేసుల వృద్ధి.. తగ్గిన ఆస్తి రికవరీ
రోడ్డు ప్రమాదాల్లో 135 మంది మృతి ఫ మహిళలపై పెరిగిన నేరాలు
70 నిర్బంధ తనిఖీలు
2117 సీసీ కెమెరాల ఏర్పాటు ఫ గణాంక వివరాలు వెల్లడించిన ఎస్పీ
నిర్మల్ కల్చరల్, డిసెంబరు 30 : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ కృషి చేస్తుందని ఎస్పీ సీహెచ్. ప్రవీణ్‌కుమార్ తెలిపారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 2020 వార్షిక నేరనివేదిక గణాంకాలను ఆయన వెల్లడించారు. జిల్లాలో నమోదైన వివిధ కేసు లు వివరించారు. జిల్లా పోలీస్ యంత్రాంగం అనునిత్యం ప్రజాసమస్యలు పరి ష్కరిస్తూ ముందుకు పోతున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజల్లో చైతన్యం తెచ్చామని అన్నారు. రోడ్డు ప్రమాదాల రేటు తగ్గిందని అన్నారు. జిల్లా లో గత ఏడాదిలో నమోదైన కేసులతో పోల్చి వివరాలు తెలిపారు.
7.21 శాతం కేసుల పెరుగుదల
2021లో జిల్లాలో గత ఏడాదికంటే 7.21 శాంత కేసులు నమోదయ్యాయి. 20 20లో 2521 కేసులు నమోదు కాగా 2021లో 2703 కేసులు నమోదయ్యాయి. తీవ్రమైన కేసులు 12.24 శాతం పెరిగాయి. గత ఏడాది హత్యలు, అత్యాచార కేసులు 18 నమోదు కాగా ఈసారి 17 నమోదయ్యాయి. 5.5 శాతం తగ్గాయి.
పెరిగిన రాత్రి దొంతనాలు
గత ఏడాది 42 రాత్రిపూట దొంగతనాలు జరుగగా ఈ ఏడాది 69 కేసులు నమోదై 64.28 శాతం పెరిగాయి. సాధారణ దొంగతనాలు 87 జరిగి - 13 శాతం తగ్గాయి. గొలుసు దొంగతనాలు ఆరు జరిగాయి. దొంగతనాలు కేసులలో ఆస్తుల రికవరీ 21,12,895 చేయగా గత ఏడాది 45.48 శాతం రికవరీ, ప్రస్తుతం 27.61 శాతం రికవరీ అయ్యింది.
మహిళలపై పెరిగిన నేరాలు
మహిళలపై 2021లో 257 నేరాలపై కేసులు నమోదయ్యాయి. వీటి వృద్ధి రేటు 34.55 శాతం పెరిగింది. గత ఏడాది 191 కేసులు నమోదు కాగా భర్తల వేధింపు కేసులు 79 నమోదయ్యాయి. అపహరణ కేసులు 33, అవమానపర్చిన కేసులు 55 నమోదు కాగా 53 షీటీం కౌన్సిలింగ్ నిర్వహించాయి. 17 మానభంగం కేసు లున్నాయి. 202 అదృశ్యం కేసులు నమోదు కాగా 146 మహిళలున్నారు.
పేకాట కేసులు 73
జిల్లాలో 73 పేకాట కేసుల్లో 401 మందిని కేసు బుక్ చేసి అరెస్ట్ చేశారు. వారి నుండి 11,48,115 నగదు సీజ్ చేశారు. 45 మందిపై గుట్కా కేసులు 4 కల్తీ విత్తన విక్రయ కేసులు, 15 మందిపై అక్రమ బెల్టు షాపు నిర్వహిస్తున్నందున కేసులు నమోదయ్యాయి. 16 సైబర్ నేరాల కేసులున్నాయి.
ఎనిమిది మందిపై పీడీ యాక్ట్
జిల్లాలో ఎనిమిది మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. వీరంతా భైంసా ప్రాంతానికి చెందినవారు. కాగా జిల్లాలో ఇప్పటి వరకు 2117 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పలు కేసుల్లో 62 శాతం కేసులు నిరూపించబడ్డాయి. విలేకరుల సమావేశంలో భైంసా ఏఎస్పీ కిరణ్ ఖారే, నిర్మల్ ఏఎస్పీ రామ్ రెడ్డి, ఏఆర్ ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు ఉపేందర్ రెడ్డి, జీవన్ రెడ్డి పాల్గొన్నారు.
పెరిగిన రోడ్డు ప్రమాదాలు
గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. 275 రోడ్డు ప్రమాదాలు జరుగగా 135 మంది మృత్యువాత పడ్డారు. గత ఏడాది 114 మంది మృతి చెందారు. వాహన తనిఖీల్లో పట్టుబడ్డ 2,46,344 కేసుల్లో 8,99,88,810 జరిమానా వసూలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడ్డ వారిలో 25 మందికి జైలు శిక్ష పడింది. 3,691 మంది పట్టుబడ్డారు. గత ఏడాది 37 చీటింగ్ కేసులు నమోదు కాగా ఈయేడు 65 కేసులు నమోదయ్యాయి. 17 నమ్మకద్రోహం కేసులు నమోదయ్యాయి.