శ్రీరాంపూర్‌లో పోలీసుల 2కే రన్‌

ABN , First Publish Date - 2021-10-20T03:51:36+05:30 IST

శ్రీరాంపూర్‌ పోలీసుల ఆధ్వ ర్యంలో మంగళవారం 2కే రన్‌ను నిర్వహించారు. జైపూర్‌ ఏసీపీ నరేందర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఈసం పల్లి ప్రభాకర్‌లు జెండా ఊపి ప్రారంభించారు.

శ్రీరాంపూర్‌లో పోలీసుల 2కే రన్‌
శ్రీరాంపూర్‌లో 2కే రన్‌ను ప్రారంభిస్తున్న ఏసీపీ నరేందర్‌

నస్పూర్‌, అక్టోబరు 19: శ్రీరాంపూర్‌ పోలీసుల ఆధ్వ ర్యంలో మంగళవారం 2కే రన్‌ను నిర్వహించారు. జైపూర్‌ ఏసీపీ నరేందర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఈసం పల్లి ప్రభాకర్‌లు జెండా ఊపి ప్రారంభించారు. శ్రీ రాంపూర్‌ బస్టాండ్‌ నుంచి ఆర్‌కే-6 హనుమాన్‌ దేవాలయం వరకు 2కే రన్‌ జరిగింది. అనంతరం పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. ఏసీపీ నరేందర్‌ మాట్లాడుతూ ఈనెల 21న పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం జరుపుతున్నట్లు తెలిపారు.  శ్రీరాంపూ ర్‌ సీఐ రాజు, ఎస్సై మంగీలాల్‌, కౌన్సిలర్‌ పూదరి కుమార్‌, సాయి బాబా ఆలయ కమిటీ చైర్మన్‌ రాజేంద్రపాని పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-20T03:51:36+05:30 IST