క్రీడలతో శారీరక ధృఢత్వం

ABN , First Publish Date - 2021-11-22T04:18:52+05:30 IST

క్రీడలతో మానసికోల్లాసంతో పాటు శారీరక ధృడత్వం కలుగుతుందని బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్‌ అన్నారు. పట్టణంలోని ఏఎంసీ 2 మైదానంలో బెల్లంపల్లి సబ్‌ డివిజన్‌ పోలీసు ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ఆదివారం నిర్వహించారు.

క్రీడలతో శారీరక ధృఢత్వం
విజేత జట్టుకు షీల్డ్‌ అందజేస్తున్న ఏసీపీ ఎడ్ల మహేష్‌

- బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్‌
బెల్లంపల్లి, నవంబరు 21: క్రీడలతో మానసికోల్లాసంతో పాటు శారీరక ధృడత్వం కలుగుతుందని బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్‌ అన్నారు.  పట్టణంలోని ఏఎంసీ 2 మైదానంలో బెల్లంపల్లి సబ్‌ డివిజన్‌ పోలీసు ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ఆదివారం నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో బెల్లంపల్లి రూరల్‌ సర్కిల్‌ టీం, మందమర్రి సర్కిల్‌ టీం, తాండూర్‌ సర్కిల్‌ టీం, బెల్లంపల్లి 1టౌన్‌ టీంలు పాల్గొనగా తాండూర్‌ సర్కిల్‌ టీం విజేతగా నిలిచింది. విజేత జట్టుకు ఏసీపీ షీల్డ్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి సబ్‌ డివిజన్‌లో పోలీస్‌ ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. క్రీడలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. సమయం దొరికినప్పుడల్లా పోలీసులు వ్యా యామం, యోగా చేయాలని సూచించారు. పోలీసు సిబ్బందికి ఫిజికల్‌ ఫిట్‌ నెస్‌, శారీరక సామర్థ్యం పెరగడానికి 5 కిలోమీటర్లు, 10 కిలో మీటర్ల పరుగుతో పాటు వివిధ రకాల క్రీడలను నిర్వహించ నున్నామ ని తెలిపారు.  క్రీడల్లో బెల్లంపల్లి సబ్‌ డివిజన్‌లోని సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, ప్రొబేషనరీ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-11-22T04:18:52+05:30 IST