ఆదివాసీ గ్రామాల్లో పెర్సపెన్‌ పూజలు

ABN , First Publish Date - 2021-01-28T05:30:57+05:30 IST

పుస్యమాసాన్ని పురస్కరించుకొని మండలంలోని ఆదివాసీ గిరిజన గ్రామాల్లో కుల దేవత పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కుల దేవతలైన పెర్సపెన్‌ (పెద్ద దేవుడు), జంగుబాయి, బీమల్‌ దేవతలకు పూజలు చేస్తున్నారు.

ఆదివాసీ గ్రామాల్లో పెర్సపెన్‌ పూజలు
పొల్లుగూడలో పెర్సపెన్‌ (పెద్ద దేవుడు)కు పూజలు చేస్తున్న ఆదివాసీలు

ఇంద్రవెల్లి, జనవరి 27: పుస్యమాసాన్ని పురస్కరించుకొని మండలంలోని ఆదివాసీ గిరిజన గ్రామాల్లో కుల దేవత పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కుల దేవతలైన పెర్సపెన్‌ (పెద్ద దేవుడు), జంగుబాయి, బీమల్‌ దేవతలకు పూజలు చేస్తున్నారు. బుధవారం మండలంలోని వాల్గొండ గ్రామ పంచాయతీ పరిధిలోని పొల్లుగూడడ గ్రామంలో జుగ్నక్‌వంశీయులు పెర్సపెన్‌ పూజలు నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం జుగ్నక్‌ వారి అల్లులు ఆలయం నుంచి దేవుడిని కిందకు దింపి ప్రత్యేక పూజల మధ్య అలంకరించారు. కబోద జుగ్నక్‌ మహాదు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కుకున్నారు. అనంతరం రాత్రి గ్రామం సమీపంలోని వాగు వద్ద పుణ్య స్నానానికి బయల్దేరారు. గురువారం రాత్రి మహాపూజ నిర్వహించనున్నట్లు జుగ్నక్‌ వంశం పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ పెద్దలు జుగ్నక్‌ మహాదు, కోరెంగ శంబు, పటేల్‌, జుగ్నక్‌ కాశీరాం, ఆత్రం శంకర్‌, జుగ్నక్‌ జైతు, కోరెంగ లక్కుపటేల్‌ తదితరులున్నారు.

Updated Date - 2021-01-28T05:30:57+05:30 IST