ఒమైక్రాన్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2021-12-10T03:55:37+05:30 IST
ఒమైక్రాన్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదనపుకలెక్టర్ రాజేశం అన్నారు. గురు వారం మండలంలోని పోతెపల్లి పంచాయతీలో సర్పంచ్ చంద్రమౌళితో కలిసి ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు.

పెంచికలపేట: ఒమైక్రాన్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదనపుకలెక్టర్ రాజేశం అన్నారు. గురు వారం మండలంలోని పోతెపల్లి పంచాయతీలో సర్పంచ్ చంద్రమౌళితో కలిసి ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరుమాస్కులు దరించడంతోపాటు భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్‌లు వాడాలన్నారు. గ్రామపంచా యతీ పరిధిలో వ్యాక్సిన్ తీసుకోకుండా మిగిలి ఉన్న 105మందిలో 96మందికి టీకానువేశారు. కార్యక్ర మంలో తహసీల్దార్ అనంతరాజ్, ఎంపీడీవో శ్రీనివాస్, వైద్యులు సీతారాం, ప్రేంసాగర్ తదితరులు ఉన్నారు.
దహెగాం: మండలంలోని ఇట్యాల గ్రామంలో గురువారం ఎంపీడీవో సత్యనారాయణ కరోనా వ్యాక్సిన్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు పెట్టు కోవద్దని, వందశాతం వ్యాక్సినేషన్‌కు సహకరించా లన్నారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సుధారాణి, సర్పంచ్ మురారి, ఏఎన్‌ఎంపద్మ, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.