అలంకార ప్రాయం..

ABN , First Publish Date - 2021-05-03T04:12:08+05:30 IST

వెనుకబడ్డ కు లాలకు ఆర్థిక చేయూతనిచ్చి, అభివృద్ధి పథంలో న డపాల్సిన బీసీ కార్పొరేషన్‌ బడ్జెట్‌ కేటాయింపుల్లేక కునారిల్లుతోంది.

అలంకార ప్రాయం..
జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది అధికారి కార్యాలయం

బీసీ కార్పొరేషన్‌ రుణాల మంజూరులో తీవ్ర జాప్యం

-నాలుగు సంవత్సరాలుగా టార్గెట్‌ నిల్‌

-జిల్లాలో 5వేల పై చిలుకు ధరఖాస్తులు పెండింగ్‌

-నిరుద్యోగులకు తప్పని ఎదురు చూపులు

మంచిర్యాల, మే 2 (ఆంధ్రజ్యోతి): వెనుకబడ్డ కు లాలకు ఆర్థిక చేయూతనిచ్చి, అభివృద్ధి పథంలో న డపాల్సిన బీసీ కార్పొరేషన్‌ బడ్జెట్‌ కేటాయింపుల్లేక కునారిల్లుతోంది. నాలుగేళ్లుగా ఎలాంటి నిధులు విడుదల కాకపోవడంతో అలంకార ప్రాయంగా మారిపోయింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన రూ. 4 కోట్ల 88 లక్షలు మినహా మ ళ్లీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. అంత కు ముందు 2015- 16లో మంజూరైన 269 యూనిట్లలో నేటికీ 164 యూనిట్లు గ్రౌండింగ్‌ కాకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆ తరువాత 2016-17, 2018-19, 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క యూనిట్‌ మంజూరు కాకపోవడం గమనార్హం. బడ్జెట్‌ కేటాయింపులు జరుగు తాయని ప్రభుత్వం చెబుతుండటంతో రుణాల కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

నాలుగేళ్లుగా జాడలేని రుణాలు...

మూడేళ్లుగా బీసీ కార్పోరేషన్‌కు బడ్జెట్‌ కేటాయించకపోవడంతో స్వయం ఉపాధి రుణాల కోసం  నిరు ద్యోగులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా లో 4 లక్షలకు పైగా వెనుకబడ్డ కులస్థులు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2015-16 ఆ ర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 269 వ్యక్తిగత రుణాలు మంజూరు చేసినప్పటికీ ఇప్పటి వరకు కేవలం 105 యూనిట్లకు నిధులు విడుదల కావడం గమనార్హం. వరుసగా నాలుగు సంవత్సరాలకు సం బంధించి ప్రభుత్వం లక్ష్యం విధించకపోగా పైసా వి డుదల చేయలేదు. గ్రూపు రుణాలకు సంబంధించి యువకులు ఫర్మ్‌ రిజిస్ట్రేషన్‌లు చేయించుకొని మరీ నిరీక్షిస్తున్నారు. రుణాలు మంజూరు చేయాలని డి మాండ్‌ చేస్తూ గతంలో నిరుద్యోగ బీసీ కులాలకు చెందిన యువకులు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా కూడా చేశారు. 

క్యాటగరీలుగా విభజించినా ఫలితం శూన్యం....

బీసీ కార్పొరేషన్‌ ద్వారా మంజూరు కావాల్సిన రు ణాలను ప్రభుత్వం మూడు కేటగరీల కింద విభజించింది. చిరు వ్యాపారాలు మొదలుకొని భారీ వాహనాల కొనుగోలుకు రుణం మంజూరు చేసేందుకు ధరఖాస్తుదారులను మూడు క్యాటగరీలుగా విభజించింది. క్యాటగరీ-1 కింద రూ. లక్ష వరకు రుణం మం జూరు చేయనుండగా, క్యాటగరీ -2 కింద రూ. 2 ల క్షల వరకు, క్యాటగరీ-3 కింద రూ. 12 లక్షల వరకు రుణాలు మంజూరు చేయాల్సి ఉంది. అయితే క్యాటగరీ-1 కింద కంటి తుడుపు చర్యగా కొంత మందికి సబ్సిడీ రుణాలు అందజేయగా, ఇప్పటి వరకు నా లుగేళ్లుగా క్యాటగరీ-2, క్యాటగరీ-3 కింద తిరిగి రుణా లు మంజూరు చేయలేదు. పై మూడు కేటగరీలలో 2017-18కి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 12వేల మంది నిరుద్యోగులు ఆన్‌లైన్‌ విధానంలో రుణాల కో సం ధరఖాస్తు చేసుకోగా అర్హత ఉన్న వారిలో 6వేల మందిని ఎంపిక చేశారు. వారిలోనూ కేవలం 976 మందికి మాత్రమే రుణాలు మంజూరయ్యాయి.  

రూ. 50వేలు మంజూరు..

కేటగరీ-1 కింద దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగుల కు లక్ష రూపాయల రుణం మంజూరు చేయాల్సి ఉండగా 2017-18లో రూ. 9 కోట్లను ప్రభుత్వం విడు దల చేసింది. అందులో దరఖాస్తు చేసుకున్న వారిలో 976 మందికి రూ. 50వేల చొప్పున మొత్తం రూ. 4 కోట్ల 88 లక్షలు మంజూరయ్యాయి. మిగతా సుమా రు రూ. 4 కోట్ల పై చిలుకు నిధులు వెనక్కు మళ్లా యి. ఆశావహుల్లో అధిక భాగం క్యాటగరీ-2 మొదలు కొని ఆపైన రుణాల కోసం ధరఖాస్తు చేసుకొన్నవారు కావడంతో రూ. 50వేల రుణాలు పొందే వారులేక ని ధులు వెనక్కు మళ్లాయి. రూ. 50 వేలు రుణానికి సంబంఽధించి ఎలాంటి పథకం రూపొందించకపోయినా అప్పటికప్పుడు సృష్టించి తూతూ మంత్రంగా రుణాలు మంజూరు చేశారు. కేటగరీ-1 కింద ధరఖాస్తులు చేసుకున్న 5 సెక్టార్లలో కేవలం  ఐఎస్‌బీ (ఇం డస్ట్రీ సర్వీస్‌ బిజినెస్‌) సెక్టార్‌కు మాత్రమే రూ. 50 వేల చొప్పున రుణాలు మంజూరు చేశారు. ఇంకా కు ల వృత్తులు, పశు సంవర్ధకశాఖ, వ్యావసాయ రం గం, రవాణా రంగానికి సంబంధించి ఒక్క దరఖాస్తుదారునికి కూడా రుణం మంజూరు చేయకపోవడం గమనార్హం. 

నాలుగేళ్లుగా టార్గెట్లు లేవు...

బీసీ వెల్ఫేర్‌ జిల్లా అధికారి ఖాజా నజీం అలీ

వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖలో రుణాల మంజూరులో గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం టార్గెట్లు పెట్టలేదు. 2017-18 సంవత్సరం మిన హా ఇతరత్రా ఒక్క లోనుకూడా మంజూరు చేయలేదు. నిధులు విడుదల చేయకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 5 వేలకుపైగా ధరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. నిధులు విడుదలైతే తప్ప రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. 
Updated Date - 2021-05-03T04:12:08+05:30 IST