వంద శాతం వ్యాక్సినేషన్‌కు కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-10-29T06:21:16+05:30 IST

జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ ఆదేశించారు.

వంద శాతం వ్యాక్సినేషన్‌కు కృషి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

నిర్మల్‌ కల్చరల్‌, అక్టోబరు 28 : జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ ఆదేశించారు. గురువారం రాత్రి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై సమీక్ష జరిపారు. ఓటరు జాబితా ఆధా రంగా అర్హులైన వారిని గుర్తించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 68 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిందన్నారు. వైద్య అధికారి ధనరాజ్‌, అవినాష్‌, శ్రీకాంత్‌, తదితర అధికారులు పాల్గొన్నారు. 

లోకేశ్వరం : కలెక్టర్‌ గురువారం మండలంలోని రాజురలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎంత మందికి మొదటి, రెండోడోస్‌ వ్యాక్సినేషన్‌ చేశారని అక్కడి సిబ్బం దిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆయనతో పాటు జిల్లావైద్యశాఖ అధికారి ధనరాజ్‌, తహసీల్దార్‌ సరిత, తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-10-29T06:21:16+05:30 IST