మంత్రాల నెపంతో గిరిజన మహిళపై దాడి

ABN , First Publish Date - 2021-05-21T17:50:41+05:30 IST

మంత్రాల నెపంతో..

మంత్రాల నెపంతో గిరిజన మహిళపై దాడి

ఉట్నూర్(ఆదిలాబాద్): మంత్రాల నెపంతో ఓ గిరిజన మహిళపై దాడి చేసిన సంఘటన మండలంలోని భూమారావు గూడలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఆత్రం నర్సింగ్‌రావు కుమ్ర మారుతిలు స్థానికంగా వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో వీరి కుటుంబంలో కొందరు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన చాహకటి మాన్కుబాయి అనే వృద్ధురాలు తమపై చేతబడి చేయడం వల్లే ఇదంతా జరుగుతోందని భావించి.. బుధవారం అర్ధరాత్రి ఆత్రం నర్సింగ్‌రావు, కుమ్ర మారుతిలు కలిసి వృద్ధురాలిపై దాడి చేశారు. కర్రలతో చితకబాదారు. ఈ విషయమై వృద్ధురాలి కుమారుడు జల్పతి గురువారం ఉట్నూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. దాడికి పాల్పడ్డ ఆత్రం నర్సింగ్ రావు, కుమ్ర మారుతిలను ఎస్సై సుబ్బారావు అరెస్టు చేశారు. కాగా.. గాయపడ్డ వృద్ధురాలిని మెరుగైన చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.

Updated Date - 2021-05-21T17:50:41+05:30 IST