పంటనష్టం సర్వే చేసిన అధికారులు
ABN , First Publish Date - 2021-07-25T04:45:41+05:30 IST
మండలంలోని ఇట్యాల, రాళ్లగూడ, బోర్లకుంట, ఒడ్డుగూడ, గిరివెల్లి గ్రామాల్లో ఏఈవో సుస్మిత వర్షాలకు నష్టపోయిన పంటలను సర్వే చేశారు.

దహెగాం: మండలంలోని ఇట్యాల, రాళ్లగూడ, బోర్లకుంట, ఒడ్డుగూడ, గిరివెల్లి గ్రామాల్లో ఏఈవో సుస్మిత వర్షాలకు నష్టపోయిన పంటలను సర్వే చేశారు.
పెంచికలపేట: అగర్‌గూడ, గన్నారం, పెంచికల పేట, ఎల్లూరు, కోయచిచ్చాల, ఎల్కపల్లి గ్రామాల్లో ఏడీఏ రాజులనాయుడు పర్యటించి వరదవల్ల జరిగిన నస్టాన్ని అంచనావేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.
సిర్పూర్(టి): మండలంలోని చింతకుంట, గార్లపేట్, రుద్రారం, టోంకిని, పారిగాం తదితరగ్రామాల్లో వ్యవసా యాధికారులు పంటలను పరిశీలించారు. ఏవో మధులత మాట్లాడుతూ పత్తిచేలలో నిలువఉన్న నీటిని తొలగించా లన్నారు. లేకపోతే మొక్కలు మురిగిపోతాయన్నారు.
కౌటాల: మండలంలోని తాట్‌పల్లి,కన్నెపల్లి, ఉండాయి పేట, తుమ్మిడిహెట్టి, పార్డి గ్రామాల్లో పంటలను ఏవో రాజేష్ పరిశీలించారు. దాదాపు 370ఎకరాల పంట నష్టం వాటినట్లు పేర్కొన్నారు.