పాఠశాలలను సందర్శించిన అధికారులు, ప్రజాప్రతినిధులు

ABN , First Publish Date - 2021-09-03T04:33:14+05:30 IST

మండల కేంద్రంలోని జిల్లాపరిషత్‌పాఠశాలను ఎంపీపీ సవిత, సర్పంచ్‌ సుమలత సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు భయపడ కుండా నిర్భయంగా పాఠశాలకు రావాలన్నారు. ఈ సందర్భంగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

పాఠశాలలను సందర్శించిన అధికారులు, ప్రజాప్రతినిధులు
పాఠశాలను సందర్శిస్తున్న విద్యాశాఖ కో ఆర్డినేటర్‌ టీం సభ్యులు

లింగాపూర్‌, సెప్టెంబరు 2: మండల కేంద్రంలోని జిల్లాపరిషత్‌పాఠశాలను ఎంపీపీ సవిత, సర్పంచ్‌ సుమలత సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు భయపడ కుండా నిర్భయంగా పాఠశాలకు రావాలన్నారు. ఈ సందర్భంగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

సిర్పూర్‌(యూ):మండలంలోని నేట్నూరు పాఠశాలను ఎంపీడీవో మధుసుదన్‌ గురు వారం సందర్శించారు. మౌళిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టాలని సమస్యలు ఉంటే సమాచారం అందించాలన్నారు.

పెంచికలపేట: మండలంలోని చెడ్వాయి జడ్పీఎస్‌ఎస్‌ పాఠశాలను గురువారం విద్యా శాఖ కోఆర్డినేటర్‌ టీంసభ్యులు సత్యనారా యణ, భరత్‌కుమార్‌ సందర్శించారు.ఈ సంద ర్భంగా కొవిడ్‌-19 నిబంధనలు, అదేవిధంగా కరోనా వ్యాప్తిచెందకుండా తీసుకోవాలని జాగ్రత్తలపై సూచనలు, సలహాలు ఇచ్చారు.

విద్యాభివృద్ధికి కృషి చేయాలి..

సిర్పూర్‌(యూ): విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఎస్సై విష్ణువర్ధన్‌ అన్నారు. గురువారం ప్రెసిడెంట్‌ గూడ పాఠ శాలలో విద్యార్థులకు చార్టులు, పెన్నులు, కాపీలు అందజేశారు. తల్లిదండ్రులు తప్ప కుండా పిల్లలను పాఠశాలలకు పంపించాల న్నారు.

మాస్కులు పంపిణీ..

వాంకిడి: మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గురువారం ఎస్సై దీకొండ రమేష్‌ విద్యార్థులకు మాస్కులు పంపిణీ చేశారు. ప్రతిరోజు విద్యార్థులు కళా శాలకు వచ్చేసమయంలో తప్పనిసరిగా మాస్కులు ధరించి రావాలన్నారు. కళాశాలల్లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ మెలగాలని సూచించారు. పీఎస్సై రామకృష్ణ, ప్రిన్సిపాల్‌ సంపత్‌, అధ్యాపకులు, పోలీస్‌సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-09-03T04:33:14+05:30 IST