అధికారులు పనితీరు మార్చుకోవాలి

ABN , First Publish Date - 2021-08-28T03:37:20+05:30 IST

అధికారులు తమ పనితీరును మార్చుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి అన్నారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

అధికారులు పనితీరు మార్చుకోవాలి
మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి

- జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 27: అధికారులు తమ పనితీరును మార్చుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి అన్నారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయా మండలాల జడ్పీటీసీలు హాజరుకాగా, ఎమ్మెల్యేలు అత్రంసక్కు, కోనేరు కోనప్ప హాజరు కాలేదు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ఆయామండలాల్లో జరుగు తున్న పలు అభివృద్ధి పనులకు ఎంపీపీ, జడ్పీటీసీలకు సమాచారం ఇవ్వకుండానే పనులు ప్రారంభిస్తున్నా రన్నారు. పనుల వివరాలను విఽధిగా ప్రజాప్రతి నిధు లకు ఇవ్వాలన్నారు. ఆసిఫాబాద్‌, వాంకిడి, కెరమెరి, తిర్యాణి తదితర మండ లాల్లో రోడ్డుపనులు ఎందుకు ప్రారంభించ డంలేదని పంచాయతీరాజ్‌ డీఈఈ ఆనంద్‌ కుమా ర్‌పై జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వట్టివాగుప్రాజెక్టు కాలువ లోని పూడికమట్టిని తొల గించాలన్నారు. అలాగే ఆయా శాఖల అధికారుల బదులు కింది స్థాయి ఉద్యోగులు హాజరు కావడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబరు 1నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయని సంబంధిత అధికా రులు, ప్రజాప్రతి నిధులు పాఠశాలలను పరిశీ లించాలన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన వెంటనే భర్తీ చేయాలని, వారికి ఇచ్చే గౌరవ వేతనం సైతం పెంచాలని ఆసిఫాబాద్‌ జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు అన్నారు. సమావేశంలో జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ కోనేరు కృష్ణరావు, రెబ్బెన జడ్పీటీసీ సంతోష్‌, డాక్టర్‌ అజయ్‌కుమార్‌, సీఈవో రత్నమాల, ఆయా మండలాల జడ్పీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ఒత్తిడి లేకుండా చూడండి

- జడ్పీ చైర్‌పర్సన్‌కు సర్పంచుల వినతి

ఆసిఫాబాద్‌: వాంకిడి మండలానికి చెందిన సర్పం చులు శుక్రవారం జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మికి తమపై కలెక్టర్‌ ఒత్తిడిలేకుండా చూడాలని వినతిపత్రం అంద జేశారు. పంచాయతీల పరిపాలన వ్యవస్థలో ప్రతి విషయంలోనూ కలెక్టర్‌ తమపై ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదుచేశారు. ఏజిల్లాలో లేనివిధంగా నిబంధనలను విధిస్తున్నారన్నారు. నూతనపంచాయతీరాజ్‌ చట్టం 2018లో లేని నిబంధనలు కూడా అమలు చేయాలని తీవ్రఒత్తిడికి గురిచేస్తున్నారని వారు పేర్కొన్నారు. తమ సమ స్యను పరిష్కరించి కలెక్టర్‌ ఒత్తిడి లేకుండా చూడాలని వారు కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో వాంకిడి మండలంలోని 24గ్రామపంచాయతీల సర్పంచులు ఉన్నారు.

Updated Date - 2021-08-28T03:37:20+05:30 IST