Telangana: గడ్డెన్న వాగు ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తివేత
ABN , First Publish Date - 2021-09-07T14:54:01+05:30 IST
ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలోని గడ్డెన్న వాగు ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

నిర్మల్: ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలోని గడ్డెన్న వాగు ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తివేసి 89157క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 73333 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటిమట్టం 358.7 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 358.50 అడుగులకు చేరింది.