బాసరలో వైభవంగా దసరా మహోత్సవాలు

ABN , First Publish Date - 2021-10-14T16:31:25+05:30 IST

బాసరలో వైభవంగా దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి.

బాసరలో వైభవంగా దసరా మహోత్సవాలు

నిర్మల్ జిల్లా: బాసరలో వైభవంగా దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. 8వ రోజైన గురువారం జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు మహర్నవమి సందర్బంగా శ్రీ జ్ఞాన సరస్వతీ దేవస్థానంలో అర్ధరాత్రి 2.30 గంటల నుంచి నిశీకాల చండీ యాగం అనంతరం మహాపూర్ణాహుతి జరిగింది. తర్వాత సంప్రోక్షణ, సరస్వతి అమ్మవారు, లక్ష్మి, మహంకాళి అమ్మ వాళ్లకు అభిషేకం అలంకరణ పాయస నైవేద్యం సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు ఘట ఉద్వాసన మహా హారతి తీర్థప్రసాద వితరణ చేశారు.

Updated Date - 2021-10-14T16:31:25+05:30 IST