నిబంధనలకు అనుగుణంగా న్యూఇయర్‌ వేడుకలు

ABN , First Publish Date - 2021-12-29T03:50:46+05:30 IST

నూతన సంవత్సరం వేడుకలను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరుపుకోవాలని ఏసీపీ సాధనరష్మీపెరుమాళ్‌ అన్నారు. మంగళవారం ఏసీపీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. ఒమైక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం జనవరి 2వ తేదీ వరకు ర్యాలీలు, బహిరంగ సభ లు నిర్వహించరాదని, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే వారు మాస్కులను ధరించి భౌతికదూరం పాటించాలన్నారు.

నిబంధనలకు అనుగుణంగా న్యూఇయర్‌ వేడుకలు
మాట్లాడుతున్న ఏసీపీ సాధనరష్మీపెరుమాళ్‌

ఏసీసీ, డిసెంబరు 28: నూతన సంవత్సరం వేడుకలను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరుపుకోవాలని ఏసీపీ సాధనరష్మీపెరుమాళ్‌ అన్నారు. మంగళవారం ఏసీపీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. ఒమైక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం జనవరి 2వ తేదీ వరకు ర్యాలీలు, బహిరంగ సభ లు నిర్వహించరాదని, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే వారు మాస్కులను ధరించి భౌతికదూరం పాటించాలన్నారు. నిబం ధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుం టామన్నారు. నూతన సంవత్సర వేడుకలను ఇండ్లలో ఆనం దంగా జరుపుకోవాలని, జీరో యాక్సిండెంట్‌ డే అమలు చేయ డానికి సబ్‌ డివిజన్‌ పరిధిలో తనిఖీలు, పెట్రోలింగ్‌ నిర్వహిం చనున్నట్లు తెలిపారు. యువత మద్యం సేవించి  అజాగ్రత్త గా వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే కఠినచ ర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధాన రోడ్డు మార్గా ల్లో బారీకేడ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  పట్టణ సీఐ నారాయణ పాల్గొన్నారు. 

 కోటపల్లి: నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా నిర్వహించుకోవాలని ఎస్‌ఐ రవి కుమార్‌ సూచించారు. మంగళవారం జాతీయ రహదారిపై  డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్టులు నిర్వహించారు.  యువకులు మద్యం సేవించి ద్విచక్రవాహనాలపై అతి వేగంగా వెళ్లడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని, దీన్ని నివారించేందుకు యువత  కుటుంబీకుల మధ్య ఇండ్లలోనే జరుపుకోవాలన్నారు. రహ దారి నిబంధనలు పాటించాలని, వాహనాల ధ్రువీకరణ పత్రాలు, లైసెన్స్‌ ఉండాలన్నారు.  


Updated Date - 2021-12-29T03:50:46+05:30 IST