బృహత్ పల్లె ప్రకృతి వనాలతో గ్రామాలకు కొత్త శోభ
ABN , First Publish Date - 2021-08-26T03:59:20+05:30 IST
బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో గ్రామాల్లో కొత్త శోభ సంతరిం చుకుందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. బుధవారం ఎల్లక్కపేటలో బృహత్ పల్లె ప్రకృతి వనం లో మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ బృహ త్ పల్లె ప్రకృతి వనాలను ప్రతీ ఒక్కరు కాపాడు కోవాలని కోరారు.

చెన్నూరురూరల్, ఆగస్టు 25 : బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో గ్రామాల్లో కొత్త శోభ సంతరిం చుకుందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. బుధవారం ఎల్లక్కపేటలో బృహత్ పల్లె ప్రకృతి వనం లో మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ బృహ త్ పల్లె ప్రకృతి వనాలను ప్రతీ ఒక్కరు కాపాడు కోవాలని కోరారు. జడ్పీటీసీ తిరుపతి, ఎంపీపీ బాపు, మార్కెట్ కమిటీ చైర్మన్ సమ్మయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ అర్చనాగిల్డా, వైస్‌చైర్మన్ నవాజుద్దీన్, తహసీల్దార్ శ్రీనివాస్‌దేశ్‌పాండే, కమిషనర్ ఖాజామొ యిజోద్దీన్, సర్పంచు రాకేష్‌గౌడ్, పాల్గొన్నారు.
చెన్నూర్: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.