లక్ష్యంపై నిర్లక్ష్యం..!

ABN , First Publish Date - 2021-08-22T05:01:41+05:30 IST

భూగర్భ జలాలను పెంపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా ఎన్నో నిధులను ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితం మాత్రం కనిపించడం లేదు. కేవలం ప్రచార ఆర్భాటాలతోనే అధికారులు సరిపెడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నా యి. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే జిల్లాలో నీటి వనరులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రతీఏటా వేసవికి ముందే భూగర్భ జలాలు అడుగంటుకపోవడంతో తీవ్రమైన నీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో తాగేందుకు గుక్కెడు మంచినీరు దొరకని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

లక్ష్యంపై నిర్లక్ష్యం..!
కలెక్టర్‌ కార్యాలయంలో అధ్వానంగా కనిపిస్తున్న ఇంకుడు గుంతలు

జిల్లాలో నత్తనడకన సాగుతున్న ఇంకుడు గుంతల నిర్మాణాలు

వృథాగా మారుతున్న వర్షపు నీరు

ప్రభుత్వ కార్యాలయాల్లో మరీ అధ్వానం

నీరుగారిపోతున్న ప్రభుత్వ లక్ష్యం

అధిక వర్షపాతం నమోదైనా అంతే..

క్షేత్ర స్థాయిలో కరువవుతున్న అవగాహన


ఆదిలాబాద్‌, ఆగస్టు21 (ఆంధ్రజ్యోతి): భూగర్భ జలాలను పెంపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా ఎన్నో నిధులను ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితం మాత్రం కనిపించడం లేదు. కేవలం ప్రచార ఆర్భాటాలతోనే అధికారులు సరిపెడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నా యి. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే జిల్లాలో నీటి వనరులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రతీఏటా వేసవికి ముందే భూగర్భ జలాలు అడుగంటుకపోవడంతో తీవ్రమైన నీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో తాగేందుకు గుక్కెడు మంచినీరు దొరకని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విస్తారంగా వర్షాలు కురుస్తున్న నీటిని ఒడిసి పట్టకపోవడంతోనే ఇలాంటి పరిస్థితికి దారి తీస్తుంది. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాల్టా చట్టాన్ని తీసుకొచ్చినా పకడ్బందీగా అమలుకు నోచుకోవడం లేదు. ప్రజల అవసరాలకు అనుగుణంగా వర్షపు నీటిని ఒడిసి పట్టక పోవడంతో భూగర్భజలాలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రభు త్వం ముందుచూపుతో ఉపాధి హామీ పథకం ద్వారా ఇంటింటికీ ఇం కుడు గుంత నిర్మాణాన్ని చేపట్టాలని లక్ష్యం పెట్టుకున్నా అధికారుల ని ర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతూనే ఉంది. క్షేత్రస్థాయిలో అవ గాహన లేకపోవడంతో ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రజలు ముం దుకు రావడం లేదు. 

అధికారుల నిర్లక్ష్యం..

ప్రతీఏటా ఇంకుడు గుంతల నిర్మాణాలపై ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ణయిస్తున్నా అధికారుల్లో అంతులేని నిర్లక్ష్యమే కనిపిస్తుంది. ఈ ఏడాది జిల్లాలో పల్లెప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించిన అధికారు లు ఇంకుడు గుంతల జోలికి వెళ్లినట్లు కనిపించలేదు. ఇంటి అనుమతులు ఇచ్చే సమయంలో విధిగా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉంటుంది. కానీ, స్థలం ఇబ్బందులతో పాటు అధికారులు కఠినంగా వ్యవహరించకపోవడంతో నూతనంగా నిర్మించే ఇంటి నిర్మాణాల్లో ఇంకుడు గుంతల జాడ కనిపించడం లేదు. అపార్ట్‌మెంట్‌ భవన నిర్మాణ సముదాయాల్లోనూ ఇంకుడు గుంతల ని ర్మాణానికి యజమానులు ముందుకు రావడం లేదు. గ్రామీణ ప్రాంతా ల్లో కొంత మేరకు ఇంకుడు గుంతలను నిర్మించుకుంటున్న సకాలంలో బిల్లులు చేతికి రావడం లేదని వాపోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో మా త్రం ఇంకుడు గుంతల ప్రాధాన్యతపై అవగాహన ఉన్నట్లు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది. 

చిత్తశుద్ధి ఏదీ?

వర్షపు నీటిని ఒడిసి పట్టడంలో జి ల్లా అధికారులకే చిత్తశుద్ధి లేకుండా పోయింది. ప్రభుత్వ కార్యాలయా ల ఆవరణలో విధిగా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఒడిసి పట్టాల్సి ఉంటుంది. ఇప్పటికీ మెజార్టీ శాఖల కార్యాలయాల ఆవరణలో ఇంకుడు గుంతలు కనిపించడమే లేదు. అక్కడక్కడ ఉన్న వాటి నిర్వాహణ గాలికొదిలేయడంతో నేలమట్టమై పోయి కనిపిస్తున్నాయి. దీంతో వర్షపు నీరు భూగర్భంలోకి ఇంకేందుకు అవకాశమే లేకుండా పోతుంది. ఏదో నిర్మించామా, వదిలేశామా అన్నట్లుగానే అధికారుల తీరు కనిపిస్తుంది. ఇంకుడు గుంతల్లోకి వర్షపు నీటిని మళ్లించక పోవడంతో వృథాగానే కనిపిస్తున్నాయి. కలెక్టర్‌ కార్యాలయంతో పాటు జడ్పీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలు పిచ్చిమొక్కల మధ్య అ ధ్వానంగా మారి దర్శనమిస్తున్నాయి. వర్షాకాలం ముగిసి పోతున్న ఇంకుడు గుంతల వైపు అధికారులు కన్నెత్తి చూడక పోవడంతో వృథాగానే మారుతుంది. ప్రజలకు ఆ దర్శంగా ఉండాల్సిన అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరించ డంపై ఆరోపణలు వస్తున్నాయి.

అధిక వర్షపాతం నమోదైనా..

జిల్లాలో ఈ ఏడాది అధిక వర్షపాతమే కురిసినా ఆశించిన స్థాయిలో వర్షపు నీటిని ఒడిసి పట్టినట్లు కనిపించడం లేదు. జూన్‌ ఒ కటో తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు జిల్లా సాధారణ వర్షపా తం 759.0 మి.మీలు కాగా, ప్రస్థుతం 1065.7మి.మీల వర్షపాతం కు రిసింది. అయినా భూగర్భ జలాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. జిల్లాలో నేల ఉపరితలం ఎత్తు పల్లాలుగా ఉండడంతో వర్షం కురిసిన వెంటనే దిగువకు వెళ్లిపోతుంది. వర్షపు నీటికి అడ్డుకట్ట వేయక పోవడంతో ఏటా వేల క్యూసెక్కుల వరద నీరు గోదావరి పాలవుతోంది. చెరువులు, కుంటల ద్వారా కొంత మేరకు భూగర్భ జలాలు పై పైకి వస్తున్న వేసవికి ముందే నీటి జాడలు కనిపించకుండా పోతున్నా యి. వరద నీటికి అడ్డుకట్టలు వేస్తే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉన్న ఆ దిశగా అధికారులు అడుగులు వేసినట్లు కనిపించడం లేదు. జిల్లాలో కురిసిన వర్షపు నీటిని ఒడిసి పడితే సాగునీటితో పాటు తాగునీటికి ఢోకా లేదన్న అభిప్రాయాలున్నాయి.

ప్రజల్లో అవగాహన కల్పిస్తాం..

కిషన్‌ (డీఆర్డీఏ పీడీ, ఆదిలాబాద్‌)

ఇంకుడు గుంతల ప్రాధాన్యతపై ప్రజల్లో మ రింత అవగాహన కల్పిస్తాం. వర్షపు నీటిని ఒడిసి పట్టడంతో భూగర్భజలాలు పుష్కలంగా పెరుగుతాయి. ఉపాధి హామీ పథకం కింద ఇంకుడు గుం తలు నిర్మించుకునే వారందరికి సకాలంలోనే బిల్లులు చెల్లిస్తు న్నాం. కొత్త ఇంటి నిర్మాణాలు చేపట్టే వారంతా ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలను తప్పని సరిగా నిర్మించుకోవాలి. కొత్తగా ని ర్మించుకునేందుకు ముందుకు వస్తే వెంటనే మంజూరు చేస్తాం.

Updated Date - 2021-08-22T05:01:41+05:30 IST