క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలి

ABN , First Publish Date - 2021-01-13T04:29:02+05:30 IST

అందరూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు.

క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

-ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

కాగజ్‌నగర్‌, జనవరి12: అందరూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మంగళవారం ఎస్పీఎం క్రీడా మైదానంలో అంతర్రాష్ట్ర క్రికెట్‌ పోటీల ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన మాట్లాడారు.   తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల క్రీడాకారులు  పాల్గొనటం శుభపరిణామన్నారు. క్రీడా పోటీలు నిర్వహిస్తున్న న్యూఎరా, ఎంసీసీ క్లబ్‌ నిర్వహకులను అభినందించారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌, న్యూఎరా, ఎంసీసీ క్లబ్‌ మెంబర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-13T04:29:02+05:30 IST