సేంద్రియ సాగుకు దేశవ్యాప్త గుర్తింపు
ABN , First Publish Date - 2021-02-26T05:53:18+05:30 IST
ఆదిలాబాద్ జిల్లా మారుమూల గిరిజన గ్రామాల్లో సాగు చేస్తున్న సేంద్రియ సాగు విధానానికి దేశవ్యాప్త గుర్తింపు దక్కింది. ఏకంగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ గిరిజన రైతుల కృషిని గుర్తించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జిల్లాలోని గుడిహత్నూర్ మండలం లింగాపూర్ గ్రామానికి రానున్నారు.

గిరిజన రైతులకు అరుదైన గౌరవం
నేడు జిల్లాకు రానున్న ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్
ఆదిలాబాద్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్ జిల్లా మారుమూల గిరిజన గ్రామాల్లో సాగు చేస్తున్న సేంద్రియ సాగు విధానానికి దేశవ్యాప్త గుర్తింపు దక్కింది. ఏకంగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ గిరిజన రైతుల కృషిని గుర్తించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జిల్లాలోని గుడిహత్నూర్ మండలం లింగాపూర్ గ్రామానికి రానున్నారు. ఉదయం 9.30గంటలకు లింగాపూర్ గ్రామానికి చేరుకొని గిరిజన కుటుంబాలతో నిర్వహించే సమ్మేళన కార్యక్రమానికి హాజరు కానున్నారు. గిరిజన రైతులకు దశాబ్ద కాలానికి పైగా అండగా నిలుస్తూ వస్తున్న ఏకలవ్య ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భాగవత్ జిల్లాకు వస్తున్న సందర్భంగా పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసింది.