నస్పూర్‌ తహసీల్దార్‌ శేఖర్‌ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2021-03-25T05:07:10+05:30 IST

నస్పూర్‌ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఆర్‌.శేఖర్‌ను బుధవారం కలెక్టర్‌ భారతీ హోళికేరి సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

నస్పూర్‌ తహసీల్దార్‌ శేఖర్‌ సస్పెన్షన్‌
శేఖర్‌, నస్పూర్‌ తహసీల్దార్‌

నస్పూర్‌, మార్చి24: నస్పూర్‌ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఆర్‌.శేఖర్‌ను బుధవారం కలెక్టర్‌ భారతీ హోళికేరి సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2018లో జైపూర్‌ తహసీల్దార్‌గా పనిచేస్తున్న సమయంలో షేట్‌పల్లి శివారులోని సర్వే నంబరు 160లో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇతరులకు పట్టా చేశారని ఆరోపణలు వచ్చాయి. ఉన్నతాధికారుల విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో ప్రస్తుతం నస్పూర్‌ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్‌.శేఖర్‌ను కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. 

Updated Date - 2021-03-25T05:07:10+05:30 IST