నాగోబా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-12-31T06:28:17+05:30 IST

ఆదివాసీల ఆరాధ్యదైవం కేస్లాపూర్‌ నాగోబా ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేయాలని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్థన్‌, మాజీ ఎంపీ గోడాం నగేష్‌లు పేర్కొన్నారు. గురువారం మండలంలో ని కేస్లాపూర్‌ గ్రామంలోని నాగోబా ఆలయంలో జరుగుతున్న అభివృద్ది పనులను జడ్పీ చైర్మన్‌తో పాటు టీడబ్లుఎసీ చైర్మన్‌ లక్కెరావుతో కలిసి పరిశీలించారు. నాగోబా జాతర సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేయాలని

నాగోబా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
ఆలయ పనులను పరిశీలిస్తున్న జడ్పీ చైర్మన్‌, మాజీ ఎంపీ

ఇంద్రవెల్లి, డిసెంబరు 30: ఆదివాసీల ఆరాధ్యదైవం కేస్లాపూర్‌ నాగోబా ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేయాలని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్థన్‌, మాజీ ఎంపీ గోడాం నగేష్‌లు పేర్కొన్నారు. గురువారం మండలంలో ని కేస్లాపూర్‌ గ్రామంలోని నాగోబా ఆలయంలో జరుగుతున్న అభివృద్ది పనులను జడ్పీ చైర్మన్‌తో పాటు టీడబ్లుఎసీ చైర్మన్‌ లక్కెరావుతో కలిసి పరిశీలించారు. నాగోబా జాతర సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో జడ్పీ కోఆప్షన్‌ సభ్యులు మహ్మద్‌ అంజద్‌, మాజీ ఆలయ కమిటీ చైర్మన్‌ మెస్రం తుకారాం ఎంపీటీసీ కోవ రాజేశ్వర్‌, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి కనక హనుమంతరావు, షేక్‌ సూఫీయాన్‌, తదితరులు ఉన్నారు. అలాగే, మండలంలోని తుమ్మగూడలో నంఇ యూత్‌ అసోషియేషన్‌ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు.

Updated Date - 2021-12-31T06:28:17+05:30 IST