వైభవంగా వాసవీ ఆలయంలో నగరేశ్వరకల్యాణం
ABN , First Publish Date - 2021-03-21T05:50:17+05:30 IST
మండల కేంద్రంలోని వాసవీమాత ఆలయ 4వ వార్షికోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.

ఖానాపూర్, మార్చి 20 : మండల కేంద్రంలోని వాసవీమాత ఆలయ 4వ వార్షికోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుండి రాత్రి వరకు ప్రత్యేకపూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఈ వే డుకలను పురస్కరించుకుని ఆలయఆవరణలో హోమం నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీ మంగళగౌరి సహిత నగరేశ్వర స్వామి, శ్రీ రమాసత్యనారాయణ స్వామిల కల్యాణ మహోత్సవాలను వేదపండితులు కన్నులపండువ గా నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పా టు చేశారు. మండలకేంద్రంతో పాటు చుట్టుప్రక్క గ్రామాల నుండి భక్తు లు అధికసంఖ్యలో తరలివచ్చి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. పలువురు ఆర్యవైశ్యసంఘం, ఆలయకమిటీ, భక్తబృందం ఆధ్వర్యంలో ఆలయానికి వచ్చిన భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించారు.